EPAPER

Tollywood: పదేళ్లుగా ఓటమి చవిచూడని ఏకైక హీరో.. ఎవరంటే..?

Tollywood: పదేళ్లుగా ఓటమి చవిచూడని ఏకైక హీరో.. ఎవరంటే..?

Tollywood.. సాధారణంగా ఏ హీరో అయినా సరే ఒక సినిమాతో విజయం సాధించారు అంటే, ఆ హీరో రేంజ్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.. అయితే ఒకసారి హిట్ పడిన తర్వాత ప్రతిసారి హిట్ వస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా హీరోలు ఎంచుకునే కథ, కథనం, నటన పైనే ఆ హీరో భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనేది ఆడియన్స్ నమ్మకం. ఇకపోతే సాధారణంగా ఏ హీరో అయినా సరే రెండు మూడు సినిమాలు వరుసగా చేశారంటే , అందులో కనీసం ఒక్కటైనా డిజాస్టర్ గా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే 100 లో ఒకరికో ఇద్దరికో హ్యాట్రిక్ లభిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక హీరో మాత్రం ఏకంగా గత పది సంవత్సరాలుగా ఓటమి చవిచూడకుండా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు.


రూ.500 కోట్ల దిశగా దేవర..

ఆయన ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR). ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం దేవర. ఈ సినిమా మొదటి రోజు నుంచి రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తో రన్ అవుతున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం బీభత్సంగా వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే రూ .500 కోట్ల క్లబ్ లోకి చేరడానికి సిద్ధమయింది ఈ సినిమా. మరోవైపు రామ్ చరణ్ , చిరంజీవి లతో కలిసి ఆచార్య సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్న కొరటాల శివ ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది.


ఆ రికార్డు క్రియేట్ చేసుకున్న ఏకైక హీరోగా ఎన్టీఆర్..

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని రికార్డు ఇప్పుడు యంగ్ టైగర్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అదేమిటంటే ఒకటి కాదు రెండు కాదు.. వరుసగా ఏడు హిట్స్ కొట్టిన ఘనత ఎన్టీఆర్ కి సాధ్యం. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో టెంపర్ సినిమా విజయం అందుకుంది. ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్లో నాన్నకు ప్రేమతో, కొరటాల శివ డైరెక్షన్లో జనతా గ్యారేజ్ , బాబి డైరెక్షన్లో జై లవకుశ, త్రివిక్రమ్ డైరెక్షన్లో అరవింద సమేత, రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్.. ఇలా వరుసగా అన్ని చిత్రాలు కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకున్నాయి. దీంతో ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. ఇలా వరుసగా ఏడు హిట్లు అందుకొని తనకంటూ సపరేట్ రికార్డును క్రియేట్ చేసుకున్నారు ఎన్టీఆర్.ఏది ఏమైనా ఒక హీరో గత పది సంవత్సరాలుగా ఫ్లాప్ చవిచూడకుండా వరుసగా విజయాలు అందుకుంటూ దూసుకుపోవడం అంటే ఇది సాధ్యమైన విషయం కాదు. అలాంటిది ఎన్టీఆర్ సాధించడంతో ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మా అన్నను ఢీకొట్టే హీరో ఇంకా పుట్టలేదంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.ఏది ఏమైనా ఎన్టీఆర్ టాలెంట్ కి, నటనకి , డాన్స్ కి, ఓవరాల్ ఎన్టీఆర్ కు అభిమానులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోతున్నారు.

Related News

SD18 : సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసింది..స్పెషల్ వీడియోతో ట్రీట్ అదిరింది మామా…

Shraddha Kapoor: పెళ్లిపై ఊహించని కామెంట్స్ చేసిన ప్రభాస్ బ్యూటీ.. గంతకు తగ్గ బొంతే..!

Sandeep Reddy Vanga With RGV : రెండు సినిమా పిచ్చి ఉన్న జంతువులు, అనిమల్ పార్కులో కలిసాయి

Aadhi Sai Kumar: కెరియర్ లో ఉన్నది ఒకటే హిట్ సినిమా, అదే మళ్లీ రీ రిలీజ్

Ram Charan: నేను నా ప్రొడ్యూసర్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి నా సినిమా పోస్టర్స్ మీద కలెక్షన్స్ వేయకండి

Kanguva Runtime: కంగువ రన్ టైం రీవిల్ చేసిన దర్శకుడు, అదే ప్లస్ అవ్వనుందా.?

Viswam OTT : సడెన్ గా ఓటీటీలోకి గోపిచంద్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Big Stories

×