Writer Thota Prasad: ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గురించి ప్రస్తావన వస్తే వినిపించే పేర్లలో పూరి జగన్నాథ్ కూడా ఉండేవారు. ఎంతోమంది స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన ఘనత దర్శకుడు పూరి జగన్నాథ్ కి ఉంది. అయితే రీసెంట్ టైమ్స్ లో పూరి జగన్నాథ్ హిట్ సినిమా చేసి చాలా రోజులైంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఒక టైం లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయాలని చాలామంది హీరోలు ఎదురుచూసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో పూరీకి డేట్స్ ఇవ్వడానికి కూడా కొంతమంది హీరోలు ముందుకు రాని పరిస్థితి. ఎట్టకేలకు పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా సినిమాను చేయనున్నట్లు అధికారకంగా ప్రకటించారు. విజయ్ సేతుపతి కథను ఓకే చేశాడు అంటేనే కచ్చితంగా డిఫరెంట్ గా ఉండబోతుంది అని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చింది. ఈ సినిమాతో పూరి జగన్నాథ్ కంబ్యాక్ ఇచ్చే అవకాశం కూడా ఉంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పూరి జగన్నాధ్ తో ట్రావెల్
ఇక పూరి జగన్నాథ్ నాగార్జున కాంబినేషన్లో వచ్చిన శివమణి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నాగార్జున కి డిఫరెంట్ క్యారెక్టర్ ను శివమణి సినిమాతో క్రియేట్ చేశాడు పూరి జగన్నాథ్. నాగార్జున కెరియర్ లో శివమణి సినిమాకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మరో సినిమా సూపర్. ఈ సినిమాతో అనుష్క తెలుగు తెరకు పరిచయమైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో నాగార్జున చేసే స్టంట్ లు అప్పట్లో బాగా ఫేమస్ అయ్యాయి. ఇకపోతే పూరి జగన్నాథ్ పీక్ టైం లో ఉన్నప్పుడు అతని దగ్గర రచయితగా పనిచేసేవారు తోట ప్రసాద్. పూరి జగన్నాథ్ చేసిన ఎన్నో సినిమాలకు తోట ప్రసాద్ రచయితగా రచనా సహకారం అందించారు. పోకిరి సినిమా విషయంలో కూడా రైటర్ తోట ప్రసాద్ ది మంచి ఇన్వాల్వ్మెంట్ ఉంది.
నా పేరు వెయ్యలేదు
ఇక సూపర్ సినిమా విషయానికి వస్తే తోటా ప్రసాద్ చాలా ఇన్వాల్వ్ వై ఆ సినిమాకు రాశారట. ఆ సినిమాలో బాగా పండిన అలీ ట్రాక్ కూడా తోట ప్రసాద్ రాసిందే. ఇప్పటికీ ఆలీ ట్రాక్ ఆ సినిమాలో ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకించి ప్రస్తావించక్కర్లేదు. ఆ సినిమా కోసం ఎంతో కష్టపడినా కూడా కనీసం తోట ప్రసాద్ పేరు వేయలేదు అని రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ తరుణంలో పూరి జగన్నాథ్ కి ఉన్న ఫైనాన్సియల్ ఇష్యూస్ వలన గట్టిగా అడగలేకపోయాను అంటూ చెప్పుకొచ్చారు. అలానే మెహర్ రమేష్ చాలా సినిమాలకు రచయితగా తాను వర్క్ చేసినట్లు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ మెహర్ రమేష్ తనకు గురువు లాంటి వాళ్లు అంటూ ప్రస్తావించారు రచయిత తోట ప్రసాద్. ప్రస్తుతం మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాకు తోట ప్రసాద్ రచయితగా వర్క్ చేస్తున్నారు.
Also Read: Karthi: సీక్రెట్ ఏజెంట్ సర్దార్ వస్తున్నాడు…