Financial Changes: 2025-26 కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. దీంతో, అనేక ఆర్థిక మార్పులు అమలులోకి రానున్నాయి. ఇందులో ముఖ్యంగా, వార్షిక ఆదాయం రూ. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు, UPI నంబర్‌ల డీయాక్టివేషన్, PAN-ఆధార్ లింకింగ్ లేని డివిడెండ్ల నిలిపివేత వంటి అనేక మార్పులు ఉన్నాయి. ఆ వివరాలను సమగ్రంగా ఇక్కడ తెలుసుకుందాం.
1. రూ. 12 లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపు
సెక్షన్ 87A కింద పన్ను రాయితీని రూ. 25,000 నుంచి రూ. 60,000 కు పెంచారు. దీని ఫలితంగా, రూ. 12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను మినహాయింపుతో పొందే అవకాశం ఉంది. ఇది మధ్య తరగతి కుటుంబాలకు గొప్ప ఊరటనిస్తుంది.
2. UPI నంబర్‌ల డీయాక్టివేషన్
ఏప్రిల్ 1 నుంచి గత 12 నెలలుగా ఉపయోగించని అన్ని UPI నంబర్‌లను బ్యాంకులు డీయాక్టివేట్ చేయనున్నాయి. కాల్స్, మెసేజ్‌లు లేదా ఇతర సేవల కోసం ఉపయోగించని మొబైల్ నంబర్‌లు కూడా తొలగించబడతాయి. మీ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయబడిన యాక్టివ్ మొబైల్ నంబర్‌ను మార్చి 31 లోగా అప్‌డేట్ చేసుకోవాలి.
3. PAN-ఆధార్ లింకింగ్ లేకుంటే డివిడెండ్ నిలిపివేత
మీ PAN, ఆధార్ మార్చి 31 లోపు లింక్ చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి డివిడెండ్ ఆదాయం అందుబాటులో ఉండదు. అంతేకాకుండా, డివిడెండ్ క్యాపిటల్ గెయిన్స్‌పై TDS పెరుగుతుంది. Form 26ASలో క్రెడిట్ అందుబాటులో ఉండదు.
4. మ్యూచువల్ ఫండ్ & డీమ్యాట్ KYC
ఏప్రిల్ 1, 2025 నుంచి మ్యూచువల్ ఫండ్, డీమ్యాట్ ఖాతాలకు KYC తప్పనిసరి చేయనున్నారు. అంతేకాదు, అన్ని నామినీ వివరాలను మళ్లీ ధృవీకరించాల్సి ఉంటుంది.
5. రెస్టారెంట్ సేవలపై 18% GST
రోజుకు రూ. 7,500 కంటే ఎక్కువ అద్దె కలిగిన హోటళ్లను ‘స్పెసిఫైడ్ ప్రాంగణాలు’గా పరిగణించనున్నారు. అటువంటి హోటళ్లలోని రెస్టారెంట్ సేవలకు 18% GST విధించనున్నారు. అయితే ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పొందే అవకాశం ఉంది.
Read Also: Laptop Cooling Tips: మండు వేసవిలో మీ లాప్‌టాప్‌తో జాగ్రత్త..ఈ …
6. బ్యాంక్ ఖాతాల్లో కనీస నిల్వ నిబంధనలు
SBI, PNB, Canara బ్యాంకులు కనీస బ్యాలెన్స్‌ను తప్పనిసరి చేయబోతున్నాయి. కనీస బ్యాలెన్స్ లేకుంటే జరిమానా విధించబడుతుంది. ఖాతాదారులు తగినంత బ్యాలెన్స్‌ను ఖాతాలో ఉంచుకోవాలి.
7. చెక్కు భద్రత పెంపు
రూ. 50,000కి పైగా చెక్కు చెల్లింపుల కోసం పాజిటివ్ పే సిస్టమ్ అమలు కానుంది. ఇందులో, ఖాతాదారులు బ్యాంకుకు చెక్కు నంబర్, తేదీ, మొత్తం, లబ్ధిదారు పేరు వంటి వివరాలను ఎలక్ట్రానిక్‌గా సమర్పించాలి. బ్యాంక్ ధృవీకరణ అనంతరం మాత్రమే చెక్కు ప్రాసెస్ చేయబడుతుంది.
8. ప్రాధాన్యతా రంగ రుణాల పెంపు
హోం లోన్ గ్రహీతలు ప్రధాన నగరాల్లో రూ. 50 లక్షల వరకు, మధ్య తరహా నగరాల్లో రూ. 45 లక్షల వరకు, చిన్న పట్టణాల్లో రూ. 35 లక్షల వరకు ప్రాధాన్యతా రంగ రుణాల కింద పొందవచ్చు.
9. TDS థ్రెషోల్డ్ పెంపు
సీనియర్ సిటిజన్ల కోసం, వడ్డీ ఆదాయంపై TDS మినహాయింపు పరిమితిని రూ. 1 లక్షకు పెంచారు. ఇతర విభాగాలకు కూడా TDS పరిమితిలో మార్పులు ఉన్నాయి.
10. TCS నిబంధనల్లో మార్పులు
ఏప్రిల్ 1, 2025 నుంచి విదేశీ ప్రయాణం, పెట్టుబడులు, ఇతర లావాదేవీలకు వర్తించే TCS పరిమితిని రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచారు. ఈ మార్పులు అంతర్జాతీయ లావాదేవీలపై ప్రభావం చూపనున్నాయి.