Pisces Zodiac sign: ఏలినాటి శని నడుస్తున్న మీనరాశి వారికి మూడు శుభవార్తలు రాబోతున్నాయి. గత రెండున్నరేళ్లుగా కష్టాల్లో ఉన్న మీనరాశి జాతకులు ఇక పండగ చేసుకోనున్నారు. అయితే మీనరాశి వారి జీవితాల్లోకి ఒక స్త్రీ రాబోతుంది. ఆ స్త్రీ వల్ల మీన రాశి జాతకులకు మంచి జరుగుతుందా..? చెడు జరుగుతుందా..? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
పన్నెండు రాశుల్లో చివరిదైన మీన రాశి జాతకులు గడిచిన రెండున్నరేళ్లలో అష్టకష్టాలు పడ్డారు. ఎన్ని పనులు చేసినా సక్సెస్ కాకపోవడం. అయిన వారి నుంచి నిందలు పడటం. ఆర్థికంగా కలిసి రాకపోవడం. జీవితమే సర్వనాశనం అయిందన్నంతగా మీన రాశి జాతకులు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. కొన్ని సందర్భాలలో సూసైడ్ చేసుకునేంతగా వీరిని సమస్యలు చుట్టు ముట్టాయి. అయితే ఉగాది తర్వాత మీన రాశి జాతకులకు కొద్దిలో కొద్దిగా మంచి రోజులు రాబోతున్నాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఈ నూతన సంవత్సరంలో ఈ రాశి జాతకులకు శని కాస్త ఊరట ఇవ్వనున్నాడని.. ఈ సంవత్సరం మీన రాశి జాతకులకు మూడు శుభ వార్తలు రాబోతున్నయంటున్నారు పండితులు.
మొదటి శుభవార్త: మీన రాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు. అందులో సొంత ఇల్లు కూడా లేకపోవడం. అద్దె ఇంట్లో ఉంటూ సొంత ఇల్లు కట్టుకోవాలని ఎంతో ప్రయత్నించిన వారు ఉంటారు. కానీ ఎంత ప్రయత్నించినా ఇప్పటికీ ఇల్లు కట్టుకోలేని వారు ఉన్నారు. అలాంటి వాళ్లకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని జ్యోతిష్యులు చెప్తున్నారు. గ్రహ బలం అనుకూలంగా ఉండటంతో మీన రాశి జాతకులకు ఈ సంవత్సరం సొంతింటి కల నెరవేరుతుందని చెప్తున్నారు. అయితే ఇది కూడా ఒక స్త్రీ వాళ్ల జీవితంలోకి రావడంతో జరుగుతుందంటున్నారు. అలాగే ఇల్లు కట్టుకోలేని వాల్లు కనీసం సొంత ఇంటి స్థలమైనా కొంటారని జ్యోతిష్యులు చెప్తున్నారు.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్
రెండవ శుభవార్త: మీనరాశి నిరుద్యోగులకు ఈ సంవత్సరం శుభవార్తలు అందనున్నాయి. ఇన్ని రోజులు ఉద్యోగాలు లేక బాధ పడేవారు. ఇక తమ బాధకు కష్టాలకు స్వస్తి చెప్పే టైం వచ్చిందంటున్నారు. ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా జాబ్ దొరక్క ఇబ్బంది పడ్డవాళ్లు నిరాశ, నిస్పృహతో మానసికంగా కృంగి పోయిన వాళ్లు.. వీడింతే ఇక వీడు దేనికి పనికిరాడు అన్నంతగా తయారైన మీన రాశి జాతకులు ఇకపై ఆలాంటి వాటికి గుడ్ బై చెప్పే సమయం ఆసన్నం అయిందంటున్నారు పండితులు. ఈ సంవత్సరం మీనరాశి నిరుద్యోగులకు తాము కోరుకున్న ఉద్యోగం లభించనుందని.. ఎవరైతే విమర్శించారో తక్కువ చేసి మాట్లాడారో వాళ్ల ముందు కాలర్ ఎగరేసుకుని బతికే టైం వస్తుందని పండితులు చెప్తున్నారు. అలా సంపాదించిన జాబ్ లో మంచి పొజిషన్‌కు చేరుకుంటారట.
మూడవ శుభవార్త: ఆర్థిక పరమైన విషయంలోనూ మీనరాశి జాతకులు మంచి యోగాన్ని చూడబోతున్నారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఇన్ని రోజులు ఆర్థికంగా చితికిపోయి.. అప్పుల పాలైన వాళ్లు కూడా తిరిగి పుంజుకునే అవకాశం వచ్చిందంటున్నారు. అప్పులు తీర్చడమే కాకుండా వృత్తి, వ్యాపారాలలో ఆర్థికంగా నిలదొక్కుకునే టైం వచ్చిందంటున్నారు.
ఈ మూడు శుభవార్తలే కాకుండా మీన రాశి జాతకుల జీవితాలలోకి ఒక స్త్రీ రానుందని. ఆమె పరిచయం వల్ల ఈ రాశి జాతకులకు చాలా మంచి జరిగే చాన్స్ ఉందంటున్నారు. ఆ స్త్రీ వల్ల చాలా అదృష్టం కలిసి వస్తుందట. ఆ స్త్రీనే పెళ్లి కూడా చేసుకునే అవకాశం ఉందంటున్నారు. కొంత మందికి గతంలో విడిపోయిన స్త్రీ మళ్లీ వాళ్ల జీవితాల్లోకి వస్తుందట. ఈ స్త్రీ రాక వల్ల అంతా మంచే జరుగుతుందని జ్యోతిష్యలు చెప్తున్నారు.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు