Varun Sandesh Constable Teaser: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస పెట్టి సినిమాలతో బిజీగా మారిపోయారు ప్రముఖ హీరో వరుణ్ సందేశ్ (Varun sandesh). ‘హ్యాపీ డేస్’ సినిమాతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన, తన నటనతో తెలుగు ఆడియన్స్ మన్ననలు అందుకున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు చేస్తున్నారు. కానీ అనుకున్నంత విజయం అయితే సాధించడం లేదు. ఇదిలా ఉండగా మొన్న మధ్య ఈయన నటించిన థ్రిల్లర్ సినిమా ‘విరాజీ’.. ఎం ?3 మీడియా పతాకంపై మహేంద్ర నాథ్ కూండ్ల ఈ సినిమాను నిర్మించారు. ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమా కథనం బాగున్నా ప్రేక్షకులను మాత్రం మెప్పించలేదు. ఇక ఇప్పుడు ‘కానిస్టేబుల్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాని ఆర్యన్ సుభాన్ దర్శకత్వం వహిస్తుండగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.
క్రైమ్ థ్రిల్లర్ మూవీగా కానిస్టేబుల్..
క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్టు గా రాబోతున్నట్టు ఈ సినిమా టీజర్ చూస్తే అర్థమవుతుంది. హత్యలు చేస్తున్న కిరాతకుడిని వెంటాడే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో యంగ్ హీరో వరుణ్ సందేశ్ నటిస్తున్నారు. ఈ సినిమాను మేకర్స్ చాలా ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కించినట్లు ఇప్పటికే పలుమార్లు వెల్లడించిన విషయం తెలిసిందే. మరి వరుస హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్ ను కానిస్టేబుల్ పట్టుకున్నాడా? లేదా? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే అంటూ కామెంట్ చేశారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా మధులిక వారణాసి (Madhulika varanasi)నటిస్తోంది. ఈ చిత్రానికి గ్యానీ , సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తూ ఉండగా.. బలగం జగదీష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మరోవైపు పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
వరుణ్ సందేశ్ సినిమాలు..
మొదట హ్యాపీడేస్ సినిమాతో ప్రేక్షకుల పరిచయమైన వరుణ్ సందేశ్, ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకున్న సినిమా అయితే ఇప్పటివరకు ఆయన ఖాతాలో పడలేదు.ఆ తర్వాత ఈయన చేసిన ‘కొత్త బంగారులోకం’ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు సరైన విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు వరుణ్ సందేశ్. ఇకపోతే వరుణ్ సందేశ తన భార్య వితికా షేర్ (Vithika Sher) తో కలిసి ఇండియన్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్బాస్ షోలో పాల్గొన్నారు. జంటగా వచ్చి ఉత్తమ పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక బిగ్ బాస్ ద్వారా భారీ పాపులారిటీ లభించడంతో అవకాశాలు బాగా వస్తాయని అందరూ అనుకున్నారు. అయితే అవకాశాలు వచ్చాయి కానీ ఆ అవకాశాలను ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారు అని నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నారు వరుణ్ సందేశ్. మరి ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో సినిమా చేస్తున్నారు. ఇప్పటివరకు ఆయన టచ్ చేయని జానర్. మరి ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.