Youtuber Anvesh : యూట్యూబర్ అన్వేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈ మధ్య ఈయన పేరు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుంది. యూట్యూబర్ గా బాగా ఫేమస్ అయ్యాడు. అందరిలాగా ఒక కంటెంట్ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తిరిగి ప్రపంచ దేశాల్లో ఒక్కో దేశంలో ఒక్కో వింతల గురించి అలాగే ప్రత్యేక వంటకాల గురించి పరిచయం చేస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసిన అతికొద్ది కాలంలోనే అన్వేష్ పాపులర్ అవడం నిజంగా విశేషం అని చెప్పాలి.
అంతే కాదు ఆయన టాలెంట్ కూడా దానికి తోడవడంతో ఎక్కువమంది అతని ఛానల్ ను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.. ఇటీవల తనకు సంబంధం లేని విషయాల్లో కూడా ఆయన జోక్యం చేసుకోవడంతో వార్తల్లో నిలిచాడు. అయితే తాజాగా అన్వేష్ గురించి పోలీసులు అన్వేషిస్తున్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అందుకు కారణం ఇదే అంటూ ఓ వీడియో కూడా నెట్టిండా వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రపంచ యాత్రకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఒక యూట్యూబర్ అన్వేష్.. దేశాలు తిరుగుతూ ఏ ఏ దేశంలో ఎక్కడెక్కడ చౌకబారు వస్తువులు లభిస్తాయో అనే విషయాన్ని తెలియజేస్తూ తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యాడు. ఎప్పుడు ప్రదేశాల గురించే చెప్పే ఈయన గతంలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ రివ్యలను చెప్పి మెగా, నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఆయన దొరికితే కొట్టాలని చూస్తున్నాం అని ఫ్యాన్స్ నెట్టింట మెసేజ్ లు పెడుతున్నారు.. అలాగే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్ష సాయికి షెల్టర్ ఇచ్చినట్లు వార్తలు రావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవాలని అన్నారు. కానీ అతని ఆచూకి తెలియకపోవడంతో సైలెంట్ అయ్యారు. తాజాగా మరోసారి పోలీసులు అతని కోసం వెతుకుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
Also Read :పెళ్లి పీటలు ఎక్కబోతున్న పాయల్ రాజ్ పుత్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..
యూట్యూబర్ అన్వేష్, సీపీ సర్జనార్ వీడియో కాల్ మాట్లాడినట్లు తెలుస్తుంది. అందులో సిపి సర్జనార్ అన్వేష్ తో సరదాగా మాట్లాడారు. ప్రపంచ దేశాలన్నీ అన్వేషిస్తూ ఉంటారా మీరు ఇండియాకు వచ్చినప్పుడు ఒకసారి కబురు చేయండి మిమ్మల్ని కలవాలని మేము అనుకుంటున్నాము అంటూ అడిగాడు. దానికి అన్వేష్ మరికొన్ని ఎపిసోడ్లు పూర్తిచేసి కచ్చితంగా నేను ఇండియాకు వస్తానని మాట ఇస్తాడు.
అయితే ఇంకొక నాలుగు ఐదు ఏళ్ళు సమయం పడుతుందని అంతవరకు నేను ఇండియాకు రానని చెప్తాడు. మరి అంతవరకే పెళ్లి ఏమీ లేకుండా అలానే తిరుగుతారని సజ్జనార్ అడుగుతాడు. దానికి అవినాష్ వండుకుని తినేవాడికి ఒక్క కోరే అడుక్కుని తినేవాడికి 66 కూరలు అంటూ ఫన్నీగా సమాధానం చెప్తాడు. అక్కడితో ఆ వీడియో కట్ అవుతుంది. మరి సర్జనార్ఎందుకు అన్వేష్ కోసం అన్వేషిస్తున్నారు తెలియలేదు కానీ ప్రస్తుతం ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పోలీసులు అన్వేష్ ను పట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అన్వేష్ కోసం ఎందుకు వెతుకుతున్నారు? ఎందుకు కలవాలి అనుకుంటున్నారు? అన్నది తెలియాల్సి ఉంది..