Shobhita dhulipala:శోభిత ధూళిపాళ (Shobhita Dhulipala). తెలుగు హీరోయిన్ అయినప్పటికీ బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకొని, అక్కడ బాలీవుడ్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది. దాదాపు 8 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈమెకు సినిమాల ద్వారా రాని గుర్తింపు అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya) తో ప్రేమాయణం కారణంగా ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ముఖ్యంగా 2021లో నాగచైతన్య తన భార్య సమంత(Samantha)కు విడాకులు ఇచ్చిన తర్వాత మరుసటి ఏడాది శోభితతో కలిసి లండన్ లో ఒక రెస్టారెంట్లో దర్శనం ఇవ్వడంతో అప్పుడే అందరూ వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఎక్కడా కూడా వీరు బయటపడే ప్రయత్నం చేయలేదు .కానీ గత ఏడాది ఆగస్టు 8వ తేదీన నాగచైతన్య, శోభిత ధూళిపాల నిశ్చితార్థం చేసుకొని సడన్గా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు. ముఖ్యంగా వీరిద్దరి నిశ్చితార్ధానికి సంబంధించిన ఫోటోలను నాగార్జున (Nagarjuna) స్వయంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
చైతూ కంటే ముందే ఆయన ప్రేమలో పడ్డ శోభిత..
గత ఏడాది డిసెంబర్లో ఈ జంట అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్ఆర్ (ANR) విగ్రహం ముందు ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. ఇకపోతే వివాహానికి ముందు శోభిత, చైతూ తరచూ ముంబైలో కలుసుకునేవారు. వివాహం తర్వాత అటు నాగ చైతన్య ‘తండేల్’ సినిమా సక్సెస్ తో జోరు మీద ఉండగా.. ఇటు శోభిత ‘గూఢచారి 2’ సినిమాలో బిజీగా ఉంది. ఇక ప్రస్తుతం శోభితకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి, లవ్ డేటింగ్ లకు చెందిన ఎన్నో అంశాలు తరచూ వార్తల్లో ఉంటాయి. ఈ క్రమంలోనే శోభిత.. చైతూతో పెళ్లి కంటే ముందు ఇంకొకరిని ప్రేమించిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.
నా ఫస్ట్ క్రష్ చైతూ కాదు – శోభిత..
శోభిత మాట్లాడుతూ.. “నా కాలేజ్ డేస్ లో నా ఫస్ట్ క్రష్ మొదలయ్యింది. నేను కాలేజీలో చదువుకునేటప్పుడు సీ.ఆర్ సార్ అంటే నాకు ఎనలేని ఇష్టం. ఆయన కళ్ళల్లో పడేందుకు ప్రతిరోజు క్లాసులో ముందు కూర్చునే దాన్ని. ప్రాక్టికల్స్ లో పదేపదే డౌట్లు అడిగి, ఆయన అటెన్షన్ ను నా వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేసేదాన్ని. అయితే ఆ తర్వాత అది ప్రేమ కాదని, ఏజ్ వల్ల వచ్చిన ఆకర్షణ అని రియలైజ్ అయ్యాను” అంటూ శోభిత చెప్పుకు వచ్చింది ఇక అట్రాక్షన్ మాత్రమే అని, అది ప్రేమ కాదని తెలిపిన ఈమె చైతూతో మాత్రమే తాను మనస్ఫూర్తిగా ప్రేమలో పడ్డానని కూడా తెలిపింది. ప్రస్తుతం తామిద్దరం ఎంతో సంతోషంగా ఉన్నామని కూడా చెప్పుకొచ్చింది శోభిత. మొత్తానికైతే శోభిత చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అటు కాలేజ్ డేస్ లో ఫస్ట్ క్రష్ మొదలైందని ఆ తర్వాత అది అసలైన ప్రేమ కాదని తెలుసుకొని మళ్లీ కెరియర్ పై ఫోకస్ పెట్టానని చెప్పిన శోభిత ఇప్పుడు చైతూను అమితంగా ప్రేమిస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నానని తెలిపింది.