Harsha Sai: ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి(Harsha Sai) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తూ.. భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అంతేకాదు బెట్టింగ్ యాప్ లలో పెట్టుబడులు పెడుతూ గతంలో విమర్శలు ఎదుర్కొన్న ఈయన.. ఆ తర్వాత అమ్మాయిని వేధించిన కేసులో ఇరుక్కున్నట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ మరోసారి స్కామ్ లో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సహాయం చేస్తామని హర్ష సాయి మనుషులు భారీగా డబ్బులు కాజేసినట్లు తెలుస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
స్కామ్ లో ఇరుక్కున్న హర్ష సాయి..
పూర్తి వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్ జిల్లాలోని మిడ్జిల్ మండలం కేంద్రంలోనీ బరిగెల ఆంజనేయులు తండ్రి.. రోడ్డు ప్రమాదంలో భారీగా గాయపడ్డారట. తండ్రి చికిత్సకు అప్పు అవడంతో సహాయం చేయాలని హర్ష సాయి ఇన్ స్టా ఇన్బాక్స్ లో మెసేజ్ పెట్టాడు. ఇదే అదునుగా భావించిన దుండగులు హర్ష సాయి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని నాలుగు లక్షల రూపాయల సహాయం చేస్తామని, ఇంస్టాలో ఆంజనేయులును నమ్మబలికారు. డాక్యుమెంట్ చార్జెస్, ఆఫీస్ బ్యాక్ అండ్ చార్జెస్ ఉంటాయని, అవి మీరు రెడీ చేసుకోమని, మేము ఇచ్చిన నెంబర్ కు మీరు ఫోన్ పే చేస్తే,ఆ మరుక్షణమే హర్ష సాయి టీమ్ మీకు ఫోన్ పే ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని వారు ఆంజనేయులును నమ్మించారు. ఇక నమ్మిన ఆంజనేయులు వారు చెప్పినట్టుగానే మంగళవారం సాయంత్రం వారిచ్చిన ఫోన్ నెంబర్ కు ఐదుసార్లు 22,500 రూపాయలను వారికి ఫోన్ పే ద్వారా పంపించారు. ఇక సహాయం కోసం మళ్లీ ఆంజనేయులు ఫోన్ చేస్తే కేవలం రూ.5500 మాత్రమే ఫోన్ పే చేసి ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసుకున్నారు . ఇక ఎన్ని సార్లు ప్రయత్నించినా ఫలితం లభించలేదు. దీంతో మోసపోయిన ఆంజనేయులు వెంటనే పోలీసులను సంప్రదించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏది ఏమైనా ఇప్పుడు హర్ష సాయి ఈ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు.
అమ్మాయిని మోసం చేసిన కేసులో హర్ష సాయి..
ఇదిలా ఉండగా గత కొన్ని నెలలకు క్రితం ఒక అమ్మాయి హర్షసాయి పై కేసు పెట్టిన విషయం తెలిసిందే. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పాడని, ఆ తర్వాత తనపై అత్యాచారం చేసి పెళ్లి చేసుకోనని మోసగించాడు అంటూ బాధిత యువతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో హర్ష సాయి తండ్రి హస్తం కూడా ఉందని, మొదట ఈ సమస్యను తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తే డబ్బులు తీసుకొని వెళ్ళిపొమ్మని తనతో చెప్పారని బాధిత యువతి తెలిపింది. ఇక దాంతో ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. అప్పట్లో పోలీసులు, కోర్టు అంటూ హర్ష సాయి భారీగా విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇరుక్కున్న స్కామ్ గురించి హర్ష సాయి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.