Heart Attack: ఆరోగ్యకరమైన శరీరం అంటే కేవలం కండరాలు, శరీరాకృతి మాత్రమే కాదు. గుండె ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. గుండె ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల కూడా వివిధ అనారోగ్యాలు వస్తాయి. ఎక్కువగా శారీరక శ్రమ చేసే వారు, అథ్లెట్లు, బాడీ బిల్డర్లు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి కష్టపడుతుంటారు. కానీ కొన్నిసార్లు అధిక శ్రమ, అధిక వ్యాయామం గుండెపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. కొన్ని రకాల లక్షణాలు గుండెపోటుకు దారితీస్తాయి.
గుండెపోటు లక్షణాలు:
1. ఛాతీ నొప్పి, ఒత్తిడి:
ఛాతీ నొప్పి లేదా ఒత్తిడిని అనుభవించడం తీవ్రమైన గుండెపోటు సంకేతం కావచ్చు. ఈ లక్షణం గుండె సమస్యలను సూచిస్తుంది. మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా మీ ఛాతీలో బరువు, నొప్పి లేదా ఒత్తిడిని అనుభవిస్తే, దానిని తేలికగా తీసుకోకండి. ఇలాంటి సమయంలో వైద్యులను తప్పకుండా సంప్రదించాలి.
2. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది:
సాధారణ పనులు చేస్తున్నప్పుడు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడితే అది గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యను సూచిస్తుంది. కనీస వ్యాయామం, లేదా తక్కవ శ్రమ తర్వాత కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం అనేది సాధారణ విషయం కాదు. ఈ సమస్య పదే పదే ఎదుర్కోవాల్సి వస్తే.. అది గుండె బలహీనత లేదా శ్వాసకోశ సమస్య వల్ల వస్తుంది.
3. హృదయ స్పందన పెరుగుదల:
మీ హృదయ స్పందన సక్రమంగా లేకుంటే చాలా వేగంగా ఉంటే లేదా కొన్నిసార్లు చాలా నెమ్మదిగా ఉంటే, అది గుండె సమస్యకు సంకేతం కూడా కావచ్చు. అరిథ్మియా సందర్భాలలో హృదయ స్పందన రేటు ఎక్కువగా ఉంటుంది. ఇది తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. మీరు కూడా అలాంటి లక్షణాలను అనుభవిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
4.తల తిరగడం, మూర్ఛపోవడం:
తల తిరగడం, తేలిక పాటి తలనొప్పితో పాటు మూర్ఛపోవడం అనేది గుండె బలహీనత, తక్కువ రక్తపోటు, గుండె నాళాలలో అడ్డంకులు కారణంగా కలిగే తీవ్రమైన సమస్య . బాడీ బిల్డర్లు , అథ్లెట్లు తరచుగా తీవ్రమైన శారీరక ఒత్తిడిని అనుభవిస్తారు. ఎలాంటి ఇబ్బంది కలిగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
Also Read: ఈ స్క్రబ్ ఒక్క సారి వాడితే చాలు.. అమ్మాయిలే అసూయపడే అందం
ఏం చేయాలి ?
తగినంత పోషకాలు, ప్రోటీన్ , ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన సమతుల్య ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోండి.
ముఖ్యంగా మీరు కఠినమైన శారీరక వ్యాయామం చేస్తుంటే గనక ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం చాలా మంచిది.
అధిక శ్రమ తగ్గించండి:
మీ సామర్థ్యానికి అనుగుణంగా క్రమంగా వ్యాయామాన్ని పెంచుకోండి.
మానసిక ఒత్తిడి గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం చాలా ముఖ్యం.