E-Paper
Advertisement

Shanmukh Jaswanth got Bail: షణ్ముఖ్ జస్వంత్ కు ఊరట.. డ్రగ్స్ కేసులో బెయిల్!

Shanmukh Jaswanth got Bail: షణ్ముఖ్ జస్వంత్ కు ఊరట.. డ్రగ్స్ కేసులో బెయిల్!
Advertisement

Shanmukh Jaswanth Got Bail in Drugs Case: డ్రగ్స్ కేసులో అరెస్టైన ప్రముఖ యూ ట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ కు ఊరట లభించింది. గురువారం డ్రగ్స్ కేసులో అరెస్టైన షణ్ముఖ్ కు తాజాగా బెయిల్ మంజూరైంది. లాయర్ కల్యాణ్ దిలీప్ సుంకర షణ్ముఖ్ కు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని లాయర్ దిలీప్ సుంకర తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన షేర్ చేసిన ఫొటోలో షన్నూ కూడా ఉన్నాడు.

యూ ట్యూబర్ గా మంచి ఫేమ్ తెచ్చుకున్న షణ్ముఖ్.. బిగ్ బాస్ లోకి ఎంటరై మరింత పేరు తెచ్చుకున్నాడు. హౌస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి షణ్ముఖ్ కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందా అన్నట్లే ఉంటున్నాయి అతని చుట్టూ జరిగే సంఘటనలు. ప్రేయసితో బ్రేకప్, తర్వాత యాక్సిడెంట్, ఇప్పుడు డ్రగ్స్ కేసు. ఇలా వరుసగా ఏదొక వివాదంతో సెన్సేషన్ అవుతున్నాడు.

Advertisement

షణ్ముఖ్ జస్వంత్ బ్రదర్.. సంపత్ వినయ్ (31) యూట్యూబ్ వీడియోలు చేస్తుంటాడు. వీరిద్దరూ కలిసి హైదరాబాద్ పుప్పాలగూడలో నివాసం ఉంటున్నారు. విశాఖకు చెందిన డాక్టర్ మౌనికతో షణ్ముఖ్ కు పరిచయం ఉండగా.. అతని ద్వారానే సంపత్ ఆమెకు 2015లో పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్యన పరిచయం ప్రేమగా మారి.. నిశ్చితార్థం వరకూ వెళ్లింది. గతేడాది డిసెంబర్ లో వీరి వివాహం జరగాల్సి ఉండగా.. యువతి తల్లికి అనారోగ్యం కారణంగా పెళ్లి వాయిదా పడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న పెళ్లి చేయాలని డేట్ ఫిక్స్ చేశారు. ఇంతలోనే సంపత్ కు మరో యువతితో 27న పెళ్లి చేస్తున్నట్లు అతని తల్లిదండ్రులు యువతికి చెప్పడంతో.. సదరు యువతి నార్సింగి పీఎస్ లో సంపత్ పై చీటింగ్ కేసు పెట్టింది.

Read More: షణ్ముఖ్‌ గురించి బయటపడుతున్న సంచలన నిజాలు.. మోసం, డ్రగ్స్, లైంగిక దాడి, అబార్షన్.. మరెన్నో!

Advertisement

యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సంపత్ కోసం అతని ఫ్లాట్ కు వెళ్లారు. అక్కడ తనిఖీలు చేస్తుండగానే షణ్ముఖ్ గంజాయితో పట్టుబడ్డాడు. వెంటనే అతనిపై డ్రగ్స్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే.. ఈ కేసులో షణ్ముఖ్ కు సంబంధం లేదని న్యాయవాది దిలీప్ సుంకర అంటున్నారు. కానీ.. షణ్ముఖ్ కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతను గంజాయి తీసుకున్నట్లు నిర్థారణ అయినట్లు తెలుస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×