BigTV English

Akul Dhawan Death: ప్రవేశానికి నైట్‌క్లబ్ నో.. చలితో భారత సంతతి విద్యార్థి మృతి!

Akul Dhawan Death: ప్రవేశానికి నైట్‌క్లబ్ నో.. చలితో భారత సంతతి విద్యార్థి మృతి!
Indian-origin US student death news

Indian-origin US student Akul Dhawan froze to death(Today’s news in telugu): భారత సంతతికి చెందిన విద్యార్థి జీవితం అమెరికాలో అత్యంత విషాదకరంగా ముగిసింది. రాత్రంతా స్నేహితులతో సరదగా గడిపేందుకు ఓ క్లబ్‌కి వెళ్లాడు ఇలినాయ్ యూనివర్సిటీ విద్యార్థి అకుల్ ధావన్. అయితే అతని ప్రవేశానికి క్లబ్ యాజమాన్యం నిరాకరించింది. అతి శీతల పరిస్థితుల కారణంగా అతను హైపోథెర్మియాకు గురయ్యాడు. దీంతో మృత్యుఒడికి చేరాడు.


గత నెల 20న ఈ ఘటన చోటు చేసుకోగా నెల రోజులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ రోజు సాయంత్రం ధావన్ స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. రాత్రి 11.30 గంటల సమయంలో పరిస్థితులు మారిపోయాయి. ధావన్ స్నేహితులంతా క్యాంపస్‌కు సమీపంలోని కేనపీ క్లబ్‌లోకి ప్రవేశించారు. కానీ ధావన్‌ను మాత్రం సిబ్బంది లోపలికి అనుమతించలేదని పోలీసులు తెలిపారు.

పలు దఫాలు లోపలికి వెళ్లే ప్రయత్నాలు చేసినప్పటికీ.. సిబ్బంది అతడిని బయటకు తోసేయడం సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. ధావన్ మృతి చెందిన రాత్రి ఉష్ణోగ్రత మైనస్ 2.7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఆ రాత్రంతా స్నేహితులు ఎన్ని సార్లు ఫోన్ చేసినా ధావన్ నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు.


ఓ స్నేహితుడు క్యాంపస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంత గాలించినా ధావన్ జాడ వారికి దొరకలేదు. మరుసటి రోజు ఉదయం ఓ భవనం వెనుక ఉన్న మెట్లపై ధావన్ పడి ఉండటాన్ని గుర్తించారు. అప్పటికే అతను మృతి చెందినట్టుగా నిర్థారణకు వచ్చారు.

మితిమీరి మద్యం సేవించడం, అతి శీతల వాతావరణంలో ఎక్కువ సమయం గడపడం వల్ల ధావన్ మృతి చెందినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. ఫిర్యాదు చేసిన అనంతరం 10 గంటలకు ధావన్ ఆచూకీ తెలియడం, అందునా ఫిర్యాదు చేసిన ప్రాంతానికి 200 అడుగుల దూరంలోనే పడి ఉండటం చూస్తే పోలీసులు సకాలంలో స్పందించలేదని తెలుస్తోందని ధావన్ తల్లిదండ్రులు ఐష్, రితూధావన్ ఆరోపిస్తున్నారు.

వారు కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నారు. తమ కొడుకు కోసం పోలీసులు అసలు గాలింపు అనేదే చేపట్టలేదని వారు ఆక్రోశిస్తున్నారు. వారు సరిగ్గా విధులు నిర్వర్తించి ఉంటే హైపోథెర్మియాకు గురయ్యేవాడని కాదన్నారు. పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తమకు అందిన సమాచారం మేరకు సకాలంలోనే స్పందించామని చెబుతున్నారు.

Tags

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×