BigTV English

Samantha : సమంత రెండో పెళ్లి పై యూట్యూబర్ షాకింగ్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్..

Samantha : సమంత రెండో పెళ్లి పై యూట్యూబర్ షాకింగ్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్..

Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత ( Samantha ) తెలుగులో సినిమాలు చెయ్యక చాలా రోజులు అయ్యింది.. కానీ ఆమె ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నారు. నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్న తర్వాత సమంత కూడా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ సమంత మాత్రం తాను రెండో పెళ్లి చేసుకోను అని మాత్రం ఎక్కడా కూడా చెప్పడం లేదు. సమంత రెండో పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట సంచలనంగా మారింది. గత కొంతకాలంగా సమంత బాలీవుడ్‌ దర్శకుడు రాజు నిడుమోరుతో డేటింగ్ చేస్తోన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇటీవల వాలంటైన్స్ డే సందర్బంగా సమంత పెట్టిన పోస్ట్ తో రిలేషన్ కన్ఫామ్ చేసుకున్నారు ఫ్యాన్స్.. అయితే సమంత మాత్రం మౌనంగానే ఉంటుంది. తాజాగా సమంత రెండో పెళ్లి గురించి ఓ యూట్యూబర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అతని ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


సమంత రెండో పెళ్లి పై కామెంట్స్.. 

కొద్ది రోజులుగా సమంత రెండో పెళ్లి చేసుకుంటుందంటూ వార్తలు ఊపందుకున్నాయి.. అటు సమంత సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్లు కూడా దాదాపు తన పెళ్లి గురించి సింక్ ఎలా ఉన్నాయని తెలుస్తుంది. ఎక్కడ మాత్రం రెండో పెళ్లి చేసుకుంటున్నా అని క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా సమంత రెండో పెళ్లి గురించి ఓ యూట్యూబర్ షాకింగ్ కామెంట్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో తన మాట్లాడుతూ సమంత రెండో పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ యూట్యూబర్ దాసరి విజ్ఞాన్ సమంత రెండో పెళ్లిపై కామెంట్స్ చేశారు.. సమంత రెండు పెళ్లి చేసుకుంటే తప్పేంటి అసలు ఎందుకు వీళ్ళు అందరికీ ఈ ఆరాటం అని అన్నాడు. నాగచైతన్య పెళ్లి చేసుకుంటే తప్పులేదు కానీ సమంత పెళ్లి చేసుకుంటే తప్పైందా? తన ఇష్టం చేసుకుందా లేదా అన్నది ఆమె నిర్ణయానికే వదిలేయాలి. ఈ రోజుల్లో మొదటి మ్యారేజ్ పోతే రెండు మ్యారేజ్ రెండోది కూడా పోతే మూడోది పెళ్లి చేసుకుంటున్నారు ఇక సమంత పెళ్లి చేసుకుంటే తప్పేంటి? అని అతను ప్రశ్నించారు.. త్వరలోనే సమంత పెళ్లి గురించి ప్రకటన ఇచ్చే అవకాశాలున్నాయని ఆయన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Also Read : కూతురికి రూ.30 కోట్లతో ఇల్లు.. పారీస్ నుంచి ఫర్నీచర్.. వాళ్లకు సురేఖ వాణి చురకలు!

సమంత డైరెక్టర్ తో ప్రేమలో పడిందా..? 

ఇకపోతే సమంత నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. సమంత ఇటీవల నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌కు సైతం రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల పార్టీలకు పబ్బులకు అలాగే కొన్ని ఈవెంట్లకు వీళ్ళిద్దరూ కలిసి వెళ్లడంతో ఈ వార్తలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. నిజానికి రాజు నిడుమోరు కు గతంలో పెళ్లయింది. అయితే ఆయనకు ఆయన భార్యకు మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. సమంతతో పెళ్లికి సిద్ధంగా ఉన్నారంటూ బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలుకు చెక్ పెట్టాలంటే అటు డైరెక్టర్ కానీ ఇటు సమంత కానీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక సమంత సినిమాలు విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయలేదు. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయలేదు కానీ వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది..

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×