OTT Movie : టైమ్ ట్రావెల్ కథలతో చాలా సినిమాలే వచ్చాయి. తెలుగులో ఆదిత్య 369 మూవీని అంత తేలిగ్గా మర్చిపోలేం. ఈ మూవీ అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కూడా టర్కీ మూవీలో హీరో టైమ్ మిషన్ ద్వారా 10 లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్తాడు. అక్కడ ఇతడు సృష్టించే అలజడి అంతా ఇంతా కాదు. కడుపుబ్బా నవ్వించే ఈ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే….
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ టర్కిష్ సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీ పేరు A.R.O.G. ఈ మూవీకి కేం ఇల్మాజ్, అలీ తనర్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక స్నేహితుణ్ణి ఆది మమానవుల కాలానికి టైమ్ మిషన్ ద్వారా పంపుతాడు. టర్కీ అంతటా దేశవ్యాప్తంగా విడుదలై అత్యధిక వసూళ్లు సాధించింది. ఈ మూవీ టర్కిష్ అత్యంత ఖరీదైన టర్కిష్ చిత్రాలలో ఒకటి గా నిలిచింది. ఈ సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
హీరో తన భార్యతో కలిసి హ్యాపీగా జీవిస్తుంటాడు. ఒకసారి చిన్ననాటి స్నేహితుడు లోగర్ హీరో దగ్గరికి వస్తాడు. చిన్నప్పటినుంచి అతనికి సైన్స్ అంటే ఇష్టం. ఒక టైం మిషన్ కనుక్కున్నానని, నీకు దానిని చూపిస్తానని హీరోని తీసుకువెళ్తాడు. అయితే అతడు టైం మిషన్ ద్వారా 10 లక్షల సంవత్సరాలు వెనక్కి పంపిస్తాడు. ఇదంతా హీరో భార్య కోసమే లోగర్ చేస్తుంటాడు. ఎందుకంటే ఆమె అంటే లోగర్ కి చాలా ఇష్టం. అందుకే హీరో అడ్డు తొలగించుకోవాలని అతన్ని టైం మిషన్ ద్వారా వెనక్కి పంపిస్తాడు. ఆ తరువాత లోగర్ అచ్చం హీరోలా తయారవుతాడు. అతని రూపంలో హీరో భార్య దగ్గరికి వెళ్లాలనుకుంటాడు. మరోవైపు హీరో డైనోసార్లు తిరిగే కాలానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఇతనికి వింత వింత జంతువులు కనిపిస్తుంటాయి. మనిషి ఎవరైనా ఉంటారేమో అని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇతనికి కొంతమంది ఆదిమానవులు కనబడతారు. వాళ్లతో హీరో కలిసి పోవడానికి ప్రయత్నిస్తాడు.
ఈ క్రమంలోనే ఒక తెగ నాయకుడు స్వర్గానికి ఒక దారి వేస్తాడు. దాని మీదకు వెళ్లి చనిపోయిన తన తండ్రిని తీసుకురమ్మని చెప్తాడు. హీరో చేసేదేం లేక ఆ దారి గుండా వెళ్తాడు. ఇదివరకే ఆ దారిలో వెళ్లిన వాళ్ళు చాలామంది చనిపోతారు. హీరో ఒక్కడు మాత్రమే పైకి వెళ్లి మళ్లీ తిరిగి వస్తాడు. ఆ తెగ నాయకుడు హీరోని బాగా పొగుడుతాడు. వాళ్లలో చైతన్యం తెప్పించడానికి హీరో ప్రయత్నాలు చేస్తుంటాడు. చదువు కూడా చెప్తాడు. చివరికి హీరో అక్కడే ఉండిపోతాడా? మళ్లీ వెనక్కి వస్తాడా? హీరో భార్యతో లోగర్ కలిసి ఉంటాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.