Raja Ravindra : టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజా రవీంద్ర (Raja Ravindra ) పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు సినిమాల్లో విలక్షణ పాత్రల్లో నటిస్తూ మరోవైపు సినీ హీరో, హీరోయిన్లకు మ్యానేజర్ గా వ్యవహారిస్తున్నారు. 1993 లో వచ్చిన నిప్పురవ్వ అనే సినిమా రాజా రవీంద్ర మొదటి సినిమా. ఆ తర్వాత సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈయన మొదట సీరియల్స్ లో నటిస్తూ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒకవైపు వరుస సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న ఈయనకు హీరో రవితేజ మేనేజర్ గా పనిచేసారు. బలవంతంగా రవితేజ తనను మేనేజర్ ను చేశాడని గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే రవితేజ తనను మేనేజర్ గా ఎందుకు తీసేశారు అన్న దానిపై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రవితేజ తనని మేనేజర్ గా ఎందుకు తొలగించారన్న విషయం పై క్లారిటీ ఇచ్చారు. ఇంకా రవితేజ గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవలు రావడానికి కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Read Also : మళ్లీ థియేటర్లలోకి క్లాసిక్ మూవీ.. రీరిలీజ్ ఎప్పుడంటే..?
రాజా రవీంద్ర ఇంటర్వ్యూ..
టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజా రవీంద్ర పలు సినిమాల్లో కీలకపాత్రలో నటిస్తూ జనాలను మెప్పిస్తున్నాడు. ఈయన నటించిన సినిమాలన్నీ మంచి హిట్టకుని అందుకోవడంతో వరుస సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. సినిమాల పరంగా నటుడుగా సక్సెస్ అయిన ఈయన హీరోలకు మేనేజర్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలోని చాలామంది హీరోలకు ఈయన మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. మొదట రవితేజ ( Raviteja ) కు మేనేజర్గా పనిచేసిన ఈయన ఆ తర్వాత ఎందుకు మానేస్తారు అన్న విషయం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రవితేజ తో నేను చాలా సన్నిహితంగా ఉండేవాడిని. నన్ను మామ అంటూ పిలుస్తూ నాతో సరదాగా ఉండేవాడు. తన పెళ్లికి కాళ్లు కడిగి కన్యాదానం చేస్తుంది కూడా నేనే అంత బంధం మా ఇద్దరి మధ్య ఉంది. కానీ సడన్గా ఏమైందో తెలియదు ఓ రోజు పిలిచి మరల రెండేళ్ల తర్వాత పిలుస్తాను మేనేజర్ గా వద్దులే మానేసేయ్ అనేసి చెప్పడంతో నేను షాక్ అయ్యాను. నేను ఏదైనా తప్పు చేశానా లేకపోతే డేట్స్ రాసుకోవడంలో మిస్టేక్స్ ఏమైనా కనపడ్డాయని ఆయన భావించారు. అయితే ఇప్పటికీ రవితేజ అతన్ని ఎందుకు తీసేసారు అన్న విషయంపై మాత్రం ఆయన కనుక్కునే ప్రయత్నం చేయలేదని చెప్పాడు. నేను మేనేజ్ అయితే వ్యవహరించకపోయినా పర్సనల్ ర్యాపోఅనేది మా ఇద్దరి మధ్య ఉంది కానీ ఎప్పుడూ దీని గురించి అయితే మాట్లాడలేదని అన్నారు. అలాగే మా ఇద్దరి మధ్య ఏవో గొడవలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం లేదని ఇంటర్వ్యూలో ఆయన క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు రవితేజ ఎవరైనా చెప్తే వినేస్తాడు. అలా నా గురించి తప్పుగా ఎవరేం చెప్పారో తెలియదు. కానీ ఇప్పటికి ఆయన చెప్తాడని చూస్తున్న అని అన్నారు. ప్రస్తుతం ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతుంది..
రవి తేజ సినిమాల విషయానికొస్తే.. కెరీర్ మొదట్లో వస్తున్న అవకాశాలు ఇప్పట్లో రాలేదని చెప్పాలి.. ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. గత ఏడాది మిస్టర్ బచ్చన్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ భారీ బడ్జెట్ తో వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.