Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం మూవీ, మే 9 న ప్రేక్షకులు ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. హర్రర్ కామెడీ మూవీ గా, ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. సమంత తన సొంత సంస్థ ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించింది. ఇక ఈ మూవీ త్వరలో ఓటీటీలో వస్తుందని భావించగా ఇప్పుడు బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఆ వివరాలు చూద్దాం
సమంత సక్సెస్ కి చెక్ పెట్టిన డిజిటల్ పార్టనర్..
శుభం మూవీ డిజిటల్ సాటిలైట్ స్రీమింగ్ హక్కులను రిలీజ్ కి ముందే భారీ ధరకు జీ సంస్థ సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో రిలీజ్ తర్వాత అనుకున్న అమౌంట్ కంటే తక్కువ ఇస్తామని జీ సంస్థ తెలిపినట్టు సమాచారం. తక్కువ ఏమాంట్ కు సినిమా కొనుగోలు చేస్తాము అని సంస్థ తెలిపింది. ఈ ఒప్పందానికి ఒప్పుకోకుంటే డీల్ ని క్యాన్సిల్ చేసుకునేందుకు, జీ సంస్థ నిర్ణయం చేసుకున్నట్టు ఓటిటి ప్లే నివేదిక వెల్లడించింది. ఇలా మొదట ఒప్పందం చేసుకొని ఇప్పుడు రద్దు చేసుకుంటామనే వైఖరితో, సమంతా అసహనం వ్యక్తం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. డిజిటల్ సాటిలైట్ స్ట్రీమింగ్ హక్కుల విషయంలో సంస్థ ప్రతినిధులతో ఆమె చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సమంత నిర్మించిన శుభం మూవీ ఒకేసారి ఓటీటీ లో, టీవీలో టెలికాస్ట్ కానుంది అని అప్పట్లో వార్త వచ్చింది.ఇక ఓటీటీ ప్లే ప్రకారం జి 5 తాజాగా సమంతకు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఇక సమంత వేరే ప్లాట్ ఫామ్ ని ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఒప్పందాన్ని వేరే ప్లాట్ ఫామ్ కు,ఆహా, జియో హాట్స్టార్ కు, మార్చాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఇక అన్ని కుదిరితే వచ్చే నెలలోనే శుభం స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
శుభం కధ..ఇలా సాగింది ..
శుభం కధ కామెడీ హర్రర్ థ్రిల్లర్ సోషల్ మెసేజ్ ఇలా అన్ని జానర్స్ ని మిక్స్ చేసి, తీసిన సినిమా. కథ విషయానికి వస్తే రాజబాబు సీతామహాలక్ష్మి తో జన్మ జన్మల బంధం సీరియల్ నేపథ్యంలో జరిగే కదా శుభం. కొన్ని సంవత్సరాలుగా టీవీలో వచ్చే సీరియల్ కి ఓ ఊరిలోని ఆడవారంతా ఎడిట్ అవుతారు. రాత్రి 9 గంటలకు టీవీలో జన్మజన్మల బంధం ప్రసారం అవుతుంది. ఆ టైంకి ఇంట్లో ఆడవాళ్లంతా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. సీరియస్ చూసే ఆడవాళ్లలో కి చనిపోయిన వాళ్ళు ప్రవేశిస్తారు.ఆడవాళ్లు ఆ టైంలో వింతగా ప్రవర్తిస్తుంటారు. సీరియల్ చూసే టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేస్తే ఇంట్లో మగవారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు .ఇలా ఊరు మొత్తం జరుగుతూ ఉంటుంది. ఈ తరుణంలో ఈ సమస్యకి పరిష్కారం కోసం మాయ(సమంత ) దగ్గరికి వెళ్తారు. ఆమె ఎలాంటి పరిష్కారం చూపింది. సీరియల్ ఎఫెక్ట్ వల్ల కథలో కనిపించే ముగ్గురు హీరోల కాపురాలు ఏ విధంగా మారాయి. వాళ్లకు అసలు పరిష్కారం ఎలా జరిగింది. అని తెలియాలంటే శుభం సినిమా థియేటర్లో చూడాల్సిందే.