BigTV English

AC Compressor: ఏసీలు ఎందుకు పేలుతాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?

AC Compressor: ఏసీలు ఎందుకు పేలుతాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?

AC Compressor: హైదరాబాద్‌లోని పాతబస్తీ మీర్‌చౌక్‌లో నిన్న మార్నింగ్ ఘోర అగ్నిప్రమాదం సంభవించి 17 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. గుల్జార్‌హౌస్ సమీపంలోని భవనంలో ఏసీ కంప్రెసర్ పేలడంతో ఈప్రపమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ కంప్రెసర్ పేలడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదాలు ఎక్కువగా ఏసీ సరిగ్గా పని చేయకపోవడం లేదా.. తప్పుడు నిర్వహణ కారణంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, ఏసీ కంప్రెసర్ ఎందుకు పేలుతుంది..? ఏసీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అనే దానిపై మనం క్లియర్ కట్‌గా తెలుసుకుందాం.


Also Read: Lady Aghori: అఘోరీ నోట్లో నుంచి రక్తం.. టెన్షన్‌లో వర్షిణి.. అసలు ఏమైందంటే?

ఏసీలు ఎందుకు పేలుతాయి..?


⦿ డ్యామేజ్ పైపుల ద్వారా రిఫ్రిజిరేటర్ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఈ గ్యాస్ మంటలు వ్యాపించవచ్చు. ఇది ఎక్కువగా ఓల్డ్ ఏసీలలో కనబడుతుంది.

⦿ ఏసీలోని ఫిల్టర్లు బ్లాక్ అవుతాయి. డస్ట్ వల్ల యూనిట్ హార్డ్ గా పనిచేస్తోంది. దీంతో ఏసీ కూలిపోయే ప్రమాదం ఏర్పడవచ్చు. అందువల్ల సరిగ్గా నిర్వహించని ఏసీలు ప్రమాదాలకు లోనవుతాయి.

⦿ కరెంట్ సరఫరాలో ఒకేసారి పెరుగుదల, తగ్గుదల నమోదైతే.. ఏపీ పరికరాలు నాశనం అవుతాయి. దీంతో అధికవేడి, స్పార్క్స్ లేదా ఫైర్ ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంటుంది.

⦿ ముఖ్యంగా ఏసీలోని కంప్రెసర్ హీట్ అవ్వడం వల్ల పేలుడు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కంటిన్యూగా ఏసీ వాడడం వల్ల హాట్ ఎక్కువగా వస్తుంది. ఈ హీట్ పెరిగినప్పుడు ఒక్కసారి మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది.

⦿ ఏసీలోని ఎలక్ట్రికల్ వైర్ల కనెక్షన్ సరిగ్గా చేయకపోతే.. తగిన మార్పిడి లేకుండా యూజ్ చేస్తే.. షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల కూడా ప్రమాదం సంభవించవచ్చు.

Also Read: NRSC Recruitment: ఏదైనా డిగ్రీ ఉంటే చాలు భయ్యా.. హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. జీతం మాత్రం రూ.56,100

ఏసీలు పేలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

⦿ ఏసీలు వాడేవారు వోల్టేజ్ స్టెబిలైజర్ యూజ్ చేయడం మంచిది. ఇది ఏసీ కంప్రెసర్, ఇతర భాగాలను కాపాడుతుంది.

⦿ మీ ఏసీ యూనిట్ చుట్టూ సరైన ఎయిర్ ఫ్లో ఉండేలా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. చుట్టూ ఆకులు, డస్ట్ వంటి వ్యర్థాలు ఉంటే ఏసీ సరిగ్గా పనిచేయదు. ఏసీ చుట్టూ ఏం లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.

⦿ మీ ఇంట్లో ఉండే ఏసీ నుంచి వాసన వస్తే వెంటనే టెక్నీషియన్ ను సంప్రదించండి.

⦿ ముఖ్యంగా ఏసీలో వాడే వైరింగ్ క్వాలిటీగా ఉండాలి. చౌకైన ఎక్స్ టెన్షన్ కేబుల్ ఏసీకి ఇబ్బందిని కలిగిస్తాయి. ఏసీ కోసం ప్రత్యేకమైన పవర్ సాకెట్‌ను చాలా బెటర్

⦿ మీ ఇంట్లో ఉన్న ఏసీలు సురక్షితంగా, ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఒక్కసారి చూద్దాం.

⦿ మీ ఇంట్లో ఏసీని కనీసం ఇయర్ లో రెండు సార్లు నీటిగా సర్వీస్ చేయించాలి. గ్యాస్ లీకేజీలు, వైరింగ్, ఫిల్టర్లు, ఇతర భాగాలను సర్వీసింగ్ చేయించడం ద్వారా ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చు.

⦿ ఏసీని కంటిన్యూగా ఆన్ లో ఉంచకూడదు. అలా ఉంచితే అది హీట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పేలే స్కోప్ ఉంటుంది. అందుకే ఏసీకీ విరామం ఇవ్వడం చాలా ముఖ్యం.

Also Read: ECIL Recruitment: మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఈ జాబ్ గిట్ల వస్తే రూ.లక్షకు పైగా వేతనం.. ఇంకెందుకు ఆలస్యం

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×