E-Paper
Advertisement

Ram – Double Ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ మరో డీల్ క్లోజ్.. రామ్ కెరీర్‌లో హయ్యెస్ట్..!

Ram – Double Ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ మరో డీల్ క్లోజ్.. రామ్ కెరీర్‌లో హయ్యెస్ట్..!
Advertisement

Ram Double Ismart Satellite Rights: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒక మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. అయినా పెద్దగా ఫలితం దక్కడం లేదు. రామ్ పోతినేని నటించిన చివరి చిత్రం ‘స్కంధ’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎన్నో అంచనాలతో తెరకెక్కింది. కానీ థియేటర్లలో రిలీజ్ అయి అందరి అంచనాలను తలకిందులు చేసింది. బాక్సాఫీసు వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో ఈ సారి ఎలా అయిన ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని రామ్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఇందులో భాగంగానే తన కెరీర్‌లో ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందించిన క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ చేస్తున్నాడు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఛార్మి కౌర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రామ్‌కి జోడీగా యంగ్ బ్యూటీ కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటిస్తుంది.

Advertisement

Also Read: డబుల్ ఇస్మార్ట్ థర్ట్ సింగిల్ అప్డేట్..ఎప్పుడంటే?

కాగా ఈ చిత్రాన్ని వచ్చే నెల అంటే ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగానే సినిమా నుంచి వరుస అప్డేట్‌లు ఇస్తూ ఆసక్తి రేకెత్తిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ ఓ రేంజ్‌లో హైలైట్ అయ్యాయి. ఇందులో రామ్ పోతినేని మాస్ లుక్ అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్‌ మూవీ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి. ప్రముఖ నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ సినిమా థ్రియేట్రికల్ రైట్స్‌ను రూ.56 కోట్లకు సొంతం చేసుకున్నారు. అలాగే హిందీ హక్కులు రూ.6 కోట్లకు, ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ రైట్స్ రూ.33 కోట్లకు అమ్ముడయ్యాయి. అంతేకాకుండా ఆడియో రైట్స్ రూ.9 కోట్లకు ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానెల్ భారీ ధరకు కొనుక్కున్నట్లు తెలుస్తోంది. శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ టీవీ ఛానెల్ జీ తెలుగు కొనుక్కున్నట్లు తెలుస్తోంది. దీనిబట్టి చూస్తే రామ్ కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్ డీల్స్ అని చెప్పాలి. అయితే దీనిపై అఫీషియల్ అప్డేట్ రావల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×