BigTV English
Advertisement

Upcoming Movies in OTT, Theatre: ఈ వారం థియేటర్ లో, ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే..

Upcoming Movies in OTT, Theatre: ఈ వారం థియేటర్ లో, ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే..

Upcoming Movies in OTT and Theatre this Week: ఆగష్టు మొదటి వారంలో పలు సినిమాలో థియోటర్లో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కూడా కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.


శివం భజే


అశ్విన్ హీరోగా నటిస్తున్న డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్.. శివం భజే.. వైవిధ్యమైన కథతో ఆగష్టు1న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. దివంగనా సూర్య వంశీ కథానాయిక. గంగా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి అప్సర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నిర్మాత మహేశ్వరెడ్డి.

‘బడ్డీ’తో మూవీతో వస్తున్న అల్లు శిరీష్‌

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న బడ్డి మూవీ ఆగష్టు 2న రిలీజ్ కానుంది. గాయత్రి భరత్వాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. స్టూడియో గ్రీన్ ఫిలింస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. జ్ఞానవేల్‌ రాజా, అధన జ్ఞానవేల్‌ రాజా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మనముందుకు వస్తుంది.

తుఫాన్ మూవీతో విజయ్‌ ఆంటోనీ

కోలీవుడ్ యాక్టర్ విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా తుఫాను. ఈ చిత్రానికి విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కమల్‌ బోరా, డి.లలిత, బి.ప్రదీప్, పంకజ్‌ బోరా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 2న రిలీజ్ కానుంది.

పొలిటికల్‌ డ్రామా చిత్రం ‘ఉలఝ్‌’

జాన్వీకపూర్ నటిస్తున్న సరికొత్త మూవీ ఉలఝ్‌’ ఆగష్టు2న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుధాంశు సరియా ఈ సినిమాను తెరకెక్కుస్తున్నారు. గుల్షన్‌ దేవయ్య, రాజేశ్‌ థైలాంగ్‌ పలువురు ఈ మూలూలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను జంగ్లీ పిక్ఛర్ నర్మిస్తోంది. ఈ చిత్రంలో జాన్వీకపూర్ యువ ఐఎస్ఎస్ ఆఫీసర్ గా కనిపించనుంది.

Also Read: స్టార్ హీరోయిన్లు కూడా పనికిరారు.. గౌతమి కూతురు అందం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే..!

ఉషా పరిణయం


డైరక్టర్ విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తన కుమారుడు శ్రీకమల్ ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న మూవీ ఉషా పరిణయం. ఈ మూవీలో తాన్వీ ఆకాంక్ష హీరోయిన్ గా నటిస్తోంది. సరికొత్త ప్రేమ కథతో ఆగష్టు2న రిలీజ్ కానుంది.

యువ తరాన్ని ఆకట్టుకునేలా..వస్తున్న చిత్రం తిరగబడరా సామి.

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తోన్న చిత్రం తిరగబడరా సామి. ఈ సినిమాలో మాల్వి మల్హోత్రా కథానాయిక. ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఆగష్టు2న రిలీజ్ కానుంది.  ప్రేమ, భావోద్వేగం, మాస్ ని అలరించే యాక్షన్ కథా చిత్రం. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.

అలనాటి రామచంద్రుడు

ఒక అమ్మాయిని గాఢంగా లవ్ చేసి నిజాయితీ గల ఓ ప్రేమికుడి కథ. మరి ఈ ఇద్దరి ప్రేమాయణం ఎలా సాగిందో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.. కృష్ణ వంశీ, మోక్ష జంటగా నటిస్తోన్న చిత్రం “అలనాటి రామచంద్రుడు”. ఈ సినిమాకి చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగష్టు 2న ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే..

నెట్‌ఫ్లిక్స్‌

అన్‌స్టేబుల్‌ 2 (వెబ్‌సిరీస్)- ఆగస్టు 1
మోడ్రన్‌ మాస్టర్స్‌ – ఆగస్టు 2

డిస్నీప్లస్ హాట్‌స్టార్‌

నో వే అవుట్ కొరియన్‌ – జులై 31
ది కింగ్ డమ్ ఆఫ్ ప్లనెట్ ఆఫ్ ది ఏప్స్ (తెలుగులో)- ఆగస్టు 2

సోనీ లైవ్

బృంద (తెలుగు) – ఆగస్టు 2

జియో సినిమాలు

డ్యూన్‌ 2 (హాలీవుడ్) – ఆగస్టు 1
ఘుడ్‌ చడీ (హిందీ) – ఆగస్టు 1
టారో (హాలీవుడ్) – ఆగస్టు 3

 

 

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×