BigTV English

Jagan vs Sharmila: జగన్‌కు ఆ భయం, అందుకే షర్మిల ఆ మాట..

Jagan vs Sharmila: జగన్‌కు ఆ భయం, అందుకే షర్మిల ఆ మాట..

బెంగుళూరులో వైసీపీ అధినేత జగన్ ఏం చేస్తున్నారు? విధ్వంసకర ఆలోచనకు ప్లాన్ చేస్తున్నారా? మళ్లీ ఏపీలోకి వచ్చేటప్పుడు చంద్రబాబు సర్కార్‌ను ఏ విధంగా తిప్పలు పెట్టాలని స్కెచ్ వేశారా? ఇవే ప్రశ్నలు వైసీపీ నేతలను వెంటాడుతున్నాయి. జగన్‌ వ్యవహారశైలిపై అధికార, విపక్షాలు తూర్పారబడుతున్నాయి. ఓ అడుగు ముందుకేసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, ఎమ్మెల్యే పదవికి ఆయన అనర్హుడని కుండ బద్దలు కొట్టేశారు.


పదవి పోయిన తర్వాత జగన్‌ను అనుక్షణం భయం వెంటాడుతోంది. అందుకే ఎక్కడకు వెళ్లినా చాలా టెన్షన్‌గా కనపడుతున్నారు. బయటకు రావాలంటే జంకుతున్నారు. అయితే తాడేపల్లి ప్యాలెస్, లేకుంటే బెంగుళూరుకి పరిమితం అవుతున్నారు. నేతలు, కార్యకర్తలతో ఆయన మమేకం కాలేదు. చంద్రబాబు ప్రభుత్వం బయటపెడుతున్న కుంభకోణాలపై అరెస్ట్ చేస్తారేమోరన్న భయం జగన్‌ను వెంటాడుతోంద న్నది వైసీపీ నేతల మాట.

ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ వ్యవహారశైలి పూర్తిగా మారిపోయింది. అధికారంలో ఉన్నట్లు మాదిరి గానే పదవిపోయిన తర్వాత వ్యవహరించాలని భావిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముందు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు వైఎస్ జగన్. ఈ విషయంలో ఆయన నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. వైసీపీ శాసనసభా‌పక్ష నేతగా ఆయన ఎన్నికైనట్లు అసెంబ్లీ లో చదివి వినిపించారు స్పీకర్.


ALSO READ: చంద్రబాబు ప్రభుత్వంలో కొత్త సలహాదారులు, కాకపోతే..

తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్‌ను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సభలో ప్రతిపక్షంలో ఎవరంటే వారికి ఆ హోదా ఇవ్వాలన్నది ఆయన మాట. ఇంతవరకు బాగానే ఉంది. అసలు శాసనసభ విధుల్లో న్యాయస్థానం జోక్యం చేసుకుంటుందా అన్నదే అసలు ప్రశ్న.

జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల. జగన్‌ను పిరికివాడిగా వర్ణించారామె. సభకు వెళ్లని జగన్, ప్రతిపక్ష హోదా కాదు కదా, చివరకు ఎమ్మెల్యే పదవికి అనర్హుడని తేల్చేశారు. వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడమే నన్నది ఆమె ప్రశ్న. చట్టసభలకు పంపిన ప్రజల్ని మోసం చేయడమేనని దుయ్యబట్టారు. మరి జగన్ మనసులో ఏముందో ఎవరికి ఎరుక.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×