BigTV English
Advertisement

Zeenat Aman: అనసూయ విన్నావా.. ఆంటీ అంటే బూతు కాదంట, సీనియర్ నటి కామెంట్స్

Zeenat Aman: అనసూయ విన్నావా.. ఆంటీ అంటే బూతు కాదంట, సీనియర్ నటి కామెంట్స్

Zeenat Aman: ఒకప్పుడు స్టార్ హీరోహీరోయిన్లుగా వెలిగిపోయిన నటీనటులు తమ ఫేమ్ కోల్పోయిన తర్వాత ఇతర హీరోహీరోయిన్లకు తల్లిగా, తండ్రిగా నటించాల్సి ఉంటుంది. అప్పుడు వారు అఫీషియల్‌గా ఆంటీ అయిపోయినట్టే. కానీ ఆంటీ అంటే చాలామంది నటీమణులకు నచ్చదు. సినీ పరిశ్రమలో మాత్రమే కాదు.. బయట ప్రపంచంలో కూడా ఆంటీ అనేది పెద్ద బూతు అయిపోయింది. మధ్య వయసు ఉన్న మహిళలు కూడా తమను ఆంటీ అంటుంటే ఇష్టపడడం లేదు. దానిని పెద్ద తప్పులాగా చూస్తున్నారు. సాధారణంగా ఇలాంటి విషయాల గురించి మాట్లాడడానికి నటీమణులు ముందుకు రారు. కానీ ఈ బాలీవుడ్ నటి మాత్రం వారికి చాలా భిన్నం అనిపిస్తోంది.


నేనైతే కాదు

ఒకప్పుడు బాలీవుడ్‌లో పలువురు స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించారు జీనత్ అమన్. ఇప్పుడు హిందీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అయిపోయారు. తాజాగా ఆంటీ అనే పిలుపుపై తన సోషల్ మీడియాలో స్పందించారు జీనత్. అంతే కాకుండా ఆ పిలుపు గురించి, దానిపై తనకు ఉన్న అభిప్రాయం గురించి చెప్పడం కోసం ‘ఆంటీ’ అని ఉన్న టీషర్ట్‌ను ధరించి ఒక స్పెషల్ పోస్ట్‌ను షేర్ చేశారు. ‘ఏ తెలివిగలవాడు ఈ ‘ఆంటీ’ అనే పదాన్ని తప్పుడు పదంగా మార్చేశాడు? అది నేనైతే కాదు. మన జీవితాల్లో అలాంటి ఆడవారు లేకపోతే మనం ఇంత సౌకర్యంగా, హాయిగా జీవించేవాళ్లమా?’ అంటూ ప్రజల ఆలోచనను ప్రశ్నించారు జీనత్.


ఇండియన్ ఆంటీ

‘ఇండియన్ ఆంటీలు అనేవారు అంతటా ఉన్నారు. పైగా వారికి నీతో రక్తసంబంధం ఉండాల్సిన అవసరం లేదు. ఆమె నీకు అండగా నిలిచే భుజం అవుతుంది. నీ కష్టాలను వింటుంది. నీకు వేడివేడి భోజనం పెడుతుంది, ఒక పిచ్చి జోక్ చెప్తుంది, ఒక నీడ అవుతుంది, కోపంలో వచ్చే తిట్టు అవుతుంది, ఎంతో జ్ఞానాన్ని పంచుతుంది. ఆంటీ అనే పదం వినగానే మీకు హడావిడిగా పనులు చేసే మహిళ గుర్తురావచ్చు లేదా మీరు కూడా నాలాగే మీ జీవితంలో ఉన్న మహిళలను చూసి నాలాగే గర్వంగా ఫీల్ అవ్వచ్చు. నేను కూడా ఒక ఆంటీనే, దానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఆ ట్యాగ్‌ను నేను గర్వంగా చూపించుకుంటాను’ అని చెప్పుకొచ్చారు జీనత్.

Also Read: బాధేస్తుంది.. అవుట్‌డోర్ షూటింగ్‌కు వెళ్తే అక్క‌డ జ‌రిగేది ఇదే: ఐశ్వ‌ర్య రాజేష్‌

చాలా సపోర్ట్ చేసింది

‘నా పిల్లలు చాలా చిన్నవయసులో ఉన్నప్పుడు నా సవతి తల్లి షమీన్ ఆంటీ చాలా సపోర్ట్ అందించారు. ఆమె మాకు వండిపెట్టేవారు, నా పిల్లలను చూసుకునేవారు, నేను కూడా జాగ్రత్తగా ఉన్నానా లేదా అని గమనించేవారు. ఇప్పుడు మీరు కూడా మీ జీవితంలోని ఆంటీల గురించి చెప్పండి. ఆంటీల గురించి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి రోజు అనుకుంటున్నాను’ అంటూ తన ఫాలోవర్స్‌కు పిలుపునిచ్చారు జీనత్ అమన్. ఈ పోస్ట్‌కు చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు రియాక్ట్ అయ్యారు. కరణ్ జోహార్ సైతం ఆంటీ మాత్రమే కాదు.. అంకుల్ అనేది కూడా బూతు కాదని నేను గ్రహించాను అంటూ తన అభిప్రాయాన్ని కామెంట్ చేశాడు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×