E-Paper
Advertisement

నేపాల్‌లో భారీ భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు, 4.9‌గా నమోదు

నేపాల్‌లో భారీ భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు, 4.9‌గా నమోదు
Advertisement

Earthquake: హిమాలయం దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.9గా నమోదు అయ్యింది. భూమికి 73 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ప్రాణ-ఆస్తి నష్టానికి సంబంధించిన ఇంకా వివరాలు రావాల్సి వుంది. వీటిపై స్థానికులను ప్రజలు అలర్ట్ చేశారు.

గురువారం ఉదయం నేపాల్‌లో భూకంపం

గురువారం తెల్లవారుజామున సిక్కిం-నేపాల్ ప్రాంతంలో భారీ భూకంపం చోటు చేసుకుంది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది. దీని ప్రభావం సిక్కిం రాజధాని గాంగ్‌టక్‌తోపాటు పశ్చిమ సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. భూమికి 73 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. అయితే ఆస్తి-ప్రాణ నష్టం గురించి ఇంకా వివరాలు తెలియాల్సి వుంది.

సిక్కింలోనూ కంపించిన భూమి

Advertisement

నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ-NCS ప్రకారం.. పశ్చిమ సిక్కింలోని గ్యాల్షింగ్ జిల్లా యుక్సోమ్‌కు వాయువ్యంగా సుమారు 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గురువారం ఉదయం 4.30 గంటలకు భూకంపం సంభవించింది. పశ్చిమ సిక్కింలోని పలు ప్రాంతాలు, రాజధానితోపాటు కొన్ని ప్రాంతాల్లో స్వల్ప భూకంప ప్రకంపనలు సంభవించాయి.

ALSO READ: ఎన్విడియాలో అల్లకల్లోలం.. ఉద్యోగినితో జెన్సన్‌కు లింకులు, పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు

Advertisement

ఇదేకాకుండా హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో బుధవారం రాత్రి స్వలంగా భూకంపం సంభవించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో వాటి కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు హడలిపోయి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే హిమాలయ రీజన్‌లో భూప్రకంపనలు తీవ్రమవుతున్నాయి. రానున్న రోజుల్లో ఏదో జరగబోతోందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

Related News

ఎన్విడియాలో అల్లకల్లోలం.. ఉద్యోగినితో జెన్సన్‌కు లింకులు, పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు

అమెరికా టారిఫ్ షాక్.. కొత్త దారుల్లో భారత గార్మెంట్ కంపెనీలు!

హోర్ముజ్ జలసంధిలో మళ్లీ టెన్షన్.. పేలిన మూడు నౌకల టాంకర్లు-ఎగిసిపడిన మంటలు, హెచ్చరించిన ఐఆర్‌జిసి

ఇజ్రాయెల్‌లో రసవత్తర సమరం.. ప్రధానిగా నెతన్యాహు పనైపోయినట్లేనా..?

పాక్‌లో కూలిన ఆనకట్టు..జనావాసాల్లోకి భారీగా నీరు, ప్రాజెక్టు కాంట్రాక్టర్ చైనాయే

వైట్‌హౌస్ వద్ద కారు ప్రమాదం.. ఆ సమయంలో అధ్యక్షుడు ట్రంప్, ప్రమాదమా లేక కుట్రా?

ఉక్కు కర్మాగారంలో భారీ పేలుడు.. 16 మంది మృతి, పేలుడు వెనుక ఏం జరిగింది?

Big Stories

Advertisement
×