E-Paper
Advertisement

హోర్ముజ్ జలసంధిలో మళ్లీ టెన్షన్.. పేలిన మూడు నౌకల టాంకర్లు-ఎగిసిపడిన మంటలు, హెచ్చరించిన ఐఆర్‌జిసి

హోర్ముజ్ జలసంధిలో మళ్లీ టెన్షన్.. పేలిన మూడు నౌకల టాంకర్లు-ఎగిసిపడిన మంటలు, హెచ్చరించిన ఐఆర్‌జిసి
Advertisement

Strait of Hormuz:  పైకి శాంతి చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నా, అమెరికా-ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా హోర్ముజ్ జలసంధిలో మూడు చమురు నౌకలు పేలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అక్రమ మార్గంలో ప్రయాణించడమే ఈ ఘటనకు కారణమని ఇరాన్ వాదన. అత్యంత ప్రమాదకర మార్గాలను ఎంచుకుంటే ఇదే పరిస్థితి ఎదురవుతుందని ఐఆర్‌జిసి హెచ్చరించింది.

హోర్ముజ్ జలసంధిలో మళ్లీ టెన్షన్

ఓ వైపు శాంతి చర్చలు.. మరోవైపు అమెరికా- ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి. జలసంధిలో మూడు చమురు ట్యాంకర్లు పేలిపోయయి. ఆయా ట్యాంకర్లు నౌకలు అక్రమ మార్గం గుండా ప్రయాణించడానికి ప్రయత్నించడమే కారణమని ఇరాన్ చెబుతోంది. దీనికి సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేసింది.

Advertisement

చమురు ట్యాంకర్ నౌకల నుండి నల్లటి పొగ పైకి లేస్తున్నట్లు అందులో స్పష్టంగా కనిపించింది. హోర్ముజ్ జలసంధిని దాటేందుకు రెండు నౌకా ట్యాంకర్లు తమ నావిగేషన్, గుర్తింపు వ్యవస్థలను పూర్తిగా నిలిపివేశాయని ఐఆర్‌జిసి అధికారిక వార్తా సంస్థ సెపా న్యూస్ ఓ ప్రకటనలో తెలిపింది. సముద్రం మైన్ల తాకిడికి గురైన తర్వాత నౌకలో ఒకటి పేలిపోయిందని, అమెరికా వైమానిక దాడుల మద్దతుతో అక్రమ మార్గాన్ని దాటేందుకు ప్రయత్నిస్తున్న మరో రెండు నౌకా ట్యాంకర్లు పేలినట్టు తెలిపింది.

పేలిన మూడు నౌకల టాంకర్లు, ఐఆర్జీసీ వార్నింగ్

రాత్రి 8.30 గంటలకు జారీ చేసిన ప్రకటనలో మంగళవారం మధ్యాహ్నం అక్రమ మార్గంలో ప్రయాణిస్తున్న మూడో ట్యాంకర్ ఓ జలాంతర్గామిని ఢీ కొట్టి పేలిపోయిందని ఇరాన్ నౌకా విభాగం పేర్కొంది. హోర్ముజ్ జలసంధిలోని అనధికారిక మార్గాలు అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది ఐఆర్‌జిసి. అమెరికా దళాల మద్దతుతో జలసంధి దాటేందుకు ప్రయత్నిస్తే మిగతా నౌకలకు ఇదే గతిని ఎదురవుతుందని పేర్కొంది.

Advertisement

ALSO READ: ఇజ్రాయెల్‌లో రసవత్తర సమరం.. ప్రధానిగా నెతన్యాహు పనైపోయినట్లేనా..?

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత హోర్ముజ్ జలసంధిపై తన పట్టును మరింత బిగించింది ఇరాన్. ఆనాటి నుంచి ఇజ్రాయెల్-అమెరికాలకు చెందిన నౌకల సురక్షిత రాకపోకలను పూర్తిగా నిరోధించింది ఇరాన్.

 

 

Related News

ఇజ్రాయెల్‌లో రసవత్తర సమరం.. ప్రధానిగా నెతన్యాహు పనైపోయినట్లేనా..?

పాక్‌లో కూలిన ఆనకట్టు..జనావాసాల్లోకి భారీగా నీరు, ప్రాజెక్టు కాంట్రాక్టర్ చైనాయే

వైట్‌హౌస్ వద్ద కారు ప్రమాదం.. ఆ సమయంలో అధ్యక్షుడు ట్రంప్, ప్రమాదమా లేక కుట్రా?

ఉక్కు కర్మాగారంలో భారీ పేలుడు.. 16 మంది మృతి, పేలుడు వెనుక ఏం జరిగింది?

ప్రపంచాన్ని ఏలుతున్న AI కింగ్.. ఒక మహిళ వల్ల జైలుకు వెళ్లబోతున్నాడా?

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. అమెరికా చరిత్రలో భారీ వెనుకడుగు, తిరిగి పుంజుకుంటాం

జపాన్‌‌ను వణికించిన భారీ భూకంపం.. భారీగా షాపులు డ్యామేజ్, బుల్లెట్ రైల్లు నిలిపివేత

Big Stories

Advertisement
×