E-Paper
Advertisement

2 బీహెచ్‌కే ఫ్లాట్‌ని కేవలం రూ. 155.. ఇంతకీ ఎక్కడో తెలుసా? ఆనందంలో కొనుగోలుదారుడు

2 బీహెచ్‌కే ఫ్లాట్‌ని కేవలం రూ. 155.. ఇంతకీ ఎక్కడో తెలుసా? ఆనందంలో కొనుగోలుదారుడు
Advertisement

Man Buying: అదృష్టం ఉంటే ఏదోరూపంలో కలిసి వస్తుంది. అది డబ్బు కావచ్చు, లేకుంటే ఇల్లు కావచ్చు. సరిగ్గా ఆ వ్యక్తికి అదే జరిగింది. లక్షల విలువ చేసే ఫ్లాట్ కేవలం రూ.155 సొంతం చేసుకున్నాడు. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం. ఎక్కడో తెలుసా?

సౌత్ మార్నింగ్ చైనా పోస్ట్ నివేదిక ప్రకారం.. ఓ చైనా వ్యక్తి కేవలం 11 యువాన్లకు అంటే ఇండియా కరెన్సీలో సుమారు 154 రూపాయలకు రెండు పడకగదుల ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు ఆ వ్యక్తి. 68 చదరపు మీటర్ల విస్తీర్ణం గల ఫ్లాట్ చైనాలోని హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లో ఉంది. ఇంత తక్కువ ధరకు ఫ్లాట్ ఎలా దక్కించుకున్నాడు? అనేది మీ డౌట్ అక్కడికే వచ్చేద్దాం.

2 బీహెచ్‌కే ఫ్లాట్‌ని కేవలం రూ. 155

Advertisement

బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా చైనాలో ఒక వ్యక్తి రూ. 155 కోట్లకు పూర్తి ఫర్నిచర్‌తో కూడిన 2 BHK ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. డబుల్ 11 ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ ఫ్లాట్‌ను అలీబాబా ఆక్షన్‌లో వేలం వేశారు. కేవలం 0.1 యువాన్‌తో బిడ్ మొదలైంది. గరిష్ట ధరను 11 యువాన్లుగా నిర్ణయించారు. 11 యువాన్లు బిడ్ చేసిన మొదటి వ్యక్తి ఆ ఫ్లాట్‌ని దక్కించు కున్నాడు. ఈ వేలంలో 1677 మంది పాల్గొన్నారు. మొత్తం 1001 బిడ్‌లు వచ్చాయి. నవంబర్ 5న వేలం ముగిసింది.

జియాంగ్సు-జెజియాంగ్ ప్రాంతానికి చెందిన ఓ కొనుగోలుదారుడు 11 యువాన్‌లకు ఆ ఫ్లాట్‌ను దక్కించుకున్నారు. ఫ్లాట్ మొత్తం ఖరీదు కేవలం 154 రూపాయలు మాత్రమే. కొనుగోలుదారు సుమారుగా 2,000 యువాన్లు అంటే రూ. 28,000 రూపాయలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తికి సంబంధించిన ఇతర ఖర్చులు కూడా ఉండవచ్చు. ఆన్‌లైన్ వేలంలో అపార్ట్‌మెంట్‌ను గెలుచుకుంటానని తాను ఊహించలేదని కొనుగోలుదారు చెప్పుకొచ్చాడు. తనకు వేరే చోటికి వెళ్లే ప్రణాళికలు లేవని, అందుకు బదులుగా శీతాకాలం పర్యటన కోసం విహార గృహంగా ఈ ఫ్లాట్‌ని ఉపయోగించుకుంటానని చెబుతున్నాడు.

Advertisement

ఆ ఫ్లాట్ అసలు ధరకు- బిడ్‌కు మధ్య చాలా తేడా ఉంది. స్థానిక ప్రాపర్టీ యాప్‌ల ప్రకారం.. ఆ ఫ్లాట్ మార్కెట్ విలువ అంచనా సుమారు 40,000 యువాన్లు. దాదాపు రూ. 5.6 లక్షలు అన్నమాట. అదే కాంప్లెక్స్‌లో తిరిగి అమ్మే ఆస్తి సగటు ధర చదరపు మీటరు సుమారు 2700 యువాన్లు. ఆస్తి వాస్తవ విలువ, ప్రమోషనల్ అమ్మకపు ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్లాట్‌ ఫారమ్ నుండి వచ్చిన సబ్సిడీ ద్వారా భర్తీ చేశారు. ఫ్లాట్‌ను 11 యువాన్‌లకు అమ్మారన్న వార్త తెలియగానే సోషల్ మీడియాలో ప్రజలు ఆశ్చర్యపోయారు.

ALSO READ: వాహనదారులకు కడుపు మంట.. చమురు కంపెనీల లాభాల పంట

వేలం ముగిసిన తర్వాత ఆ ఆఫర్ గురించి తెలుసుకున్నామని ఓ వినియోగదారుడు చెప్పారు. ఆ ఫ్లాట్‌లో ఎవరూ ఉండకపోతే నిర్వహణ ఖర్చులు భారంగా ఉంటాయని మరొకరు హెచ్చరించారు. అత్యంత చౌకగా లభించే ఆస్తి వేలం పాటలను జాగ్రత్త వహించాలని చెబుతున్నారు న్యాయ నిపుణులు. అలాంటి ఆస్తులకు యాజమాన్య హక్కులు, చెల్లించని పన్నులు, రుసుములు లేదా చట్టపరమైన వివాదాలకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చని అంటున్నారు. చైనాలో 11 యువాన్‌లకు రెండు రూముల ఫ్లాట్ అమ్మకం జరగడం ఇది మొదటిసారి కాదు. రెండేళ్ల కిందట 2024 నవంబర్‌లో షాన్‌ డాంగ్ ప్రావిన్స్‌లోని వీహైలో ఓ మహిళ 40 చదరపు మీటర్ల సముద్ర తీర అపార్ట్‌మెంట్‌ను కేవలం 11 యువాన్‌లకు కొనుగోలు చేసిన విషయం తెల్సిందే.

Related News

వాహనదారులకు కడుపు మంట.. చమురు కంపెనీల లాభాల పంట

బిర్యానీ ధరకు ఇల్లు మీ సొంతం.. కేవలం రూ.155కే రెండు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్

రూ.1లక్ష పెట్టుబడితో..లక్షలు సంపాదించండి,పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ బెనిఫిట్స్ ఇవే!

ఈ సెలబ్రిటీల విడాకులు చాలా కాస్ట్లీ గురూ.. స్పీల్‌బర్గ్ కొంప ముంచిన టిష్యూ!

ఎంబీఏ మిత్రుల గ్రేట్ ఐడియా.. అరటి వ్యర్థాలతో రూ.కోట్ల బిజినెస్.. 60% మహిళలకే ఉపాధి!

కాలేజీలో చదువుతూనే.. రూ. 15 లక్షల వ్యాపారం.. ఫుడ్ రంగంలో దుమ్మురేపుతున్న 21 ఏళ్ల యువతి!

చేతిలో స్మార్ట్‌ఫోన్, కాస్త స్కిల్ ఉంటే చాలు.. నెలకు రూ.లక్షలు సంపాదించే 6 వ్యాపారాలు!

Big Stories

Advertisement
×