Steel Plant Explosion: ఉక్కు కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో 16 మంది కార్మికులు మృతి చెందారు. మరో డజనుకు పైగానే గాయపడ్డారు. సంచలనం రేపిన ఈ ఘటన టర్కీలో వెలుగుచూసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టారు అధికారులు. అసలు ఘటన వెనుక ఏం జరిగింది?
పశ్చిమ టర్కీలోని ఉక్కు కర్మాగారంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 16 మంది కార్మికులు మరణించారు. మరో 13 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. బాయిలర్‌ను మారుస్తుండగా క్రేన్.. కొలిమిలో పడిపోవడంతో ఈ భారీ పేలుడు చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 200 మంది కార్మికులు ఉన్నారు. ఈ ఘటనపై ఇజ్మీర్ ప్రావిన్స్ గవర్నర్ సులేమాన్ మీడియాతో మాట్లాడారు.
అలీగా ప్రాంతంలో ఉన్న హబాస్ ప్లాంట్‌లో సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ పేలుడు జరిగినట్టు తెలిపారు. బాయిలర్‌ను మారుస్తుండగా భారీ పేలుడు సంభవించిందన్నారు. ఈ మంటలు కాస్త సమీపంలోని స్టీల్ మిల్లుకు వ్యాపించాయని తెలిపారు. బాయిలర్ మార్పిడి కారణంగా ఉత్పత్తి నిలిచిపోవడంతో సాధారణంగా ఉండే 300 మంది కార్మికులకు బదులుగా ఘటన సమయంలో 200 మంది ఉన్నారని చెప్పారు.
ప్రమాదాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ ఇంజన్లు, సహాయక బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేసి చివరకు మంటలను అదుపులోకి తెచ్చాయన్నారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు తెలిపారు. కేసు దర్యాప్తునకు నలుగురు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించినట్లు న్యాయశాఖ మంత్రి ఎకిన్ గుర్లెక్ తెలిపారు. ఆ పేలుడు జరిగినప్పుడు భారీ భూకంపం వచ్చినట్టు అనిపించిందని కార్మికులు చెప్పుకొచ్చారు.
ALSO READ: ప్రపంచాన్ని ఏలుతున్న AI కింగ్.. ఒక మహిళ వల్ల జైలుకు వెళ్లబోతున్నాడా?
1987లో స్థాపించిన హబాస్ ప్లాంట్.. ఏడాదికి 4.5 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ ఘటనపై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు, ఆ తర్వాత న్యాయ విచారణకు ఆదేశాలు ఇచ్చారు. వాతావరణ మార్పుపై చర్చించడానికి ప్రపంచ నాయకులు, పర్యావరణ కార్యకర్తలు టర్కీలోని అంటాల్యాలో సమావేశమైన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
🚨 BREAKING #TURKIYE #TURKEY #TURQUIA #Explosion
Tragic..
🔴 TURKIYE : POWERFUL EXPLOSION AT A METALLURGICAL FACTORY IN IZMIR CITY
A powerful explosion and subsequent fire hit the HABAS Iron and Steel Factory in the Aliaga district of Izmir. The blast occurred in the…
— LW World News (@LW_WorldNews) November 9, 2026