Israel Politics: అన్నా.. ఇరాన్‌పై యుద్ధం చెయ్.. అంటూ పదే పదే ట్రంప్‌కు ఫోన్ చేసిన నెతాన్యాహు పనైపోయిందా? ఇజ్రాయిల్ ప్రధానిగా ఆయన పదవి జారీ గల్లంతవుతోంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఐజిన్ కోట్‌కు ఆహ్వానం అందింది. కానీ ఇల్లు అలకగానే పండుగ కాదు కదా. ఐజన్ కోట్ ముందు చాలా సవాళ్లే వున్నాయి ఇప్పుడు.
ఇరాన్‌పై కయ్యానికి కాలుదువ్విన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కు గడ్డు రోజులొచ్చాయి. ట్రంప్‌తో దోస్తీ, యుద్ద వ్యూహాలు ఎలా వున్నా ఇజ్రాయిల్ ఎన్నికల్లో నెతన్యాహు అండ్ టీమ్ తమ మార్క్‌చాటలేకపోయారు. 1 ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో మొత్తం 120 స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 61 మంది సభ్యుల మద్దతు అవసరం. అధ్యక్షుడి వద్ద జరిగిన సంప్రదింపుల్లో 67 మంది ఎంపీలు ఐజన్‌కోట్‌కు అవకాశం ఇవ్వాలని సిఫార్సు చేశారు. మరోవైపు నెతన్యాహుకు 46 మంది ఎంపీలు మద్దతు తెలిపారు. ఏడుగురు ఏ అభ్యర్థికీ మద్దతు ప్రకటించలేదు.
Also read: షన్ను పెళ్లి చేసుకుంటే నేనూ చేసుకోవాలా? పెళ్లి పై దీప్తి సునయన కామెంట్స్ వైరల్!
కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఐజన్ కోట్‌ను ఆహ్వానించారు. ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఐజక్ హోర్జోగ్ ప్రభుత్వ ఏర్పాటుకు అధికారికంగా బాధ్యతలు అప్పగించారు. 19 మంది సభ్యులున్న అరబ్ పార్టీలతో పాటు నెతన్యాహు వ్యతిరేకిస్తున్న పక్షాలు ఐజన్‌కోట్కు మద్దతునిచ్చాయి.
ప్రభుత్వ ఏర్పాటుకు ఐజన్‌కోట్‌కు 28 రోజుల సమయం ఇచ్చారు. అవసరమైతే మరో 14 రోజుల గడువు పొడిగించే అవకాశం ఉంది.అరబ్ పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.అల్ట్రా ఆర్థడాక్స్ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం. లేదా రాజకీయ ప్రత్యర్థులతో జాతీయ ఐక్యత ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇప్పుడు ఐజన్ కోటు ముందున్న సవాళ్లు. బల నిరూపణలో నెగ్గుతారా? అన్నది అసలు సిసలు ఛాలెంజ్. మొత్తానికి ఇజ్రాయెల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. నెతన్యాహు స్థానంలో ఐజన్‌కోట్ ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారా? 61 మంది సభ్యుల మద్దతును కూడగట్టగలరా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also read: సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం పై.. బీజేపీ సీనియర్ నేతలు ఫైర్!