Pakistan Dam Collapsed: పాకిస్థాన్‌లో ఘోరం జరిగింది. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో టర్బేలా డ్యామ్ విస్తరణలో భాగంగా ప్రమాదవశాత్తు కొంతభాగం కుప్పకూలింది. ఈ ఘటన కారణంగా సమీప ప్రాంతాల్లోకి నీరు ఉధృతంగా ప్రవహించింది. అప్రమత్తమైన అధికారులు, ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. తక్షణమే నిర్మాణాలను నిలిపివేశారు. ఘటన వెనుక అసలు ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో చైనా నిర్మిస్తున్న ఓ ఆనకట్టులో కొంత భాగం కూలిపోయింది. దీంతో డామ్ చుట్టు పక్కల ప్రాంతాల్లోకి భారీగా నీరు ప్రవహించింది. తర్బేలా ఆనకట్ట ఐదో విస్తరణ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రదేశంలో రాతి భాగం కూలిపోయిందని తెలుస్తోంది. ఈ ఆనకట్టను చైనా కంపెనీ పవర్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా లిమిటెడ్-పిసిసిసిఎల్ నిర్మాణం చేస్తోంది. పాకిస్తాన్ జల విద్యుత్ అభివృద్ధి అథారిటీ వివరాల మేరకు.. సొరంగం తవ్వకం సమయంలో బలహీనమైన బండరాయి కూలినట్టు తెలుస్తోంది.
ఫలితంగా నీరు.. సొరంగంలో నిర్మాణం చేస్తున్న పవర్‌హౌస్‌లోకి ప్రవేశించింది. ఈ సంఘటన తర్వాత వెంటనే అత్యవసర పరిస్థితిని ప్రకటించి నిర్మాణ పనులను నిలిపి వేశారు అధికారులు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు హరిపూర్ డిప్యూటీ కమిషనర్ నస్రుల్లా ఖాన్ కొన్ని విషయాలు బయటపెట్టారు. ఈ ప్రమాదంలో పాకిస్థాన్-విదేశీ కార్మికులకు కాపాడామన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, నీటి ప్రవాహానికి ఓ పాకిస్థాన్ కార్మికుడు కొట్టుకుపోయాడు. అతడ్ని ఎమర్జెన్సీ టీమ్స్ సురక్షితంగా రక్షించాయని వివరించారు.
ఈ ఘటనతో టార్బెలా-5 ప్రాజెక్ట్ వద్ద నిర్మాణ పనులను నిలిపివేసినట్లు వెల్లడించారు. టార్బెలా-5 విస్తరణను 1530 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తోంది పాకిస్తాన్. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం తొలుత 82 బిలియన్ పాకిస్థానీ రూపీ కాగా, ప్రస్తుతం 317 బిలియన్ పాకిస్థానీ రూపాయలకు చేరింది. దీని నిర్మాణం జూన్ 2028 నాటికి పూర్తి కావాలి. ఈ డ్యామ్‌కు ప్రపంచ బ్యాంకు- ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు నుండి నిధులు అందుతున్నాయి. దీని నిర్మాణం పూర్తయితే తర్బేలా సామర్థ్యం 4,888 నుండి 6,418 మెగావాట్లకు పెరుగుతుందని ఓ అంచనా.
అత్యవసర కారణాల వల్ల డ్యామ్ నుండి అదనపు నీటిని విడుదల చేశారని, దీనివల్ల సింధు నది ప్రవాహం పెరిగే అవకాశం ఉందని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. సింధు నదిలో స్నానం చేయడం, ఈత కొట్టడం, పడవ ప్రయాణాలు చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలని పౌరులను కోరారు. భారీ నిర్మాణాల విషయంలో పాకిస్తాన్‌కు ఏమాత్రం సామర్థ్యం లేదనే విషయాన్ని గమనించాలి. ఏ నిర్మాణానికైనా చైనాపై ఆధారపడుతుంది దాయాది దేశం. చైనా ఏమాత్రం చిత్తశుద్ధిని చూపలేదు. దీని ఫలితమే ఆనకట్టు కూలిన ఘటన.
ALSO READ: వైట్‌హౌస్ వద్ద కారు ప్రమాదం.. ఆ సమయంలో అధ్యక్షుడు ట్రంప్, ప్రమాదమా లేక కుట్రా?
ఈ విషయాలను డాన్ ఛానెల్ విడుదల చేసింది. గతేడాది నుంచి టార్బెలా-5 ప్రాజెక్ట్‌లో ఇది రెండో అతిపెద్ద ప్రమాదం. జూలైలో ఈ ప్రాజెక్ట్‌కు చెందిన కాఫర్ డ్యామ్ కూలింది. ఈ ప్రమాదంపై త్రిసభ్య కమిటీ ఇచ్చింది. కాఫర్ డ్యామ్‌లో అనధికార మార్పులు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రస్తావించింది. కాంట్రాక్ట్‌లో భారీ లోపాలు జరగడంతో డ్యామ్ కుప్పకూలినట్లు స్పష్టం చేసింది.
⚡️Rock Mass Collapse At Dam In Pakistan – Tarbela T-5 Hydropower Project Suffers Breach, Triggering Massive Flooding
A protective embankment at the dam in Haripur has collapsed, triggering the evacuation of all workers.
All of the workers have been safely evacuated and water… pic.twitter.com/5FxUJtNfQe
— RT_India (@RT_India_news) November 9, 2026