E-Paper
Advertisement

వైట్‌హౌస్ వద్ద కారు ప్రమాదం.. ఆ సమయంలో అధ్యక్షుడు ట్రంప్, ప్రమాదమా లేక కుట్రా?

వైట్‌హౌస్ వద్ద కారు ప్రమాదం.. ఆ సమయంలో అధ్యక్షుడు ట్రంప్, ప్రమాదమా లేక కుట్రా?
Advertisement

White House Lockdown: ఏడాదిగా వైట్‌హౌస్ సమీపంలో చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నాయి. చీటికీ మాటికీ శ్వేత సౌధం ఎందుకు వార్తల్లోకి వస్తోంది. దీని వెనుక ఏం జరుగుతోంది? గతంలో రెండుసార్లు కాల్పులు, ఇప్పుడు కారు ప్రమాదాలు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు అమెరికన్లను వెంటాడుతున్నాయి. జరిగిన కారు ఘటనపై లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు అధికారులు.

వైట్‌హౌస్ వద్ద కారు ప్రమాదం

అమెరికా అధ్యక్షుడి భవనం వైట్‌హౌస్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ఓ కారు, సెక్యూరిటీ సైన్‌ పోస్టును ఢీ కొట్టింది. ఘటన తర్వాత అప్రమత్తమైన అధికారులు, వైట్‌హౌస్‌ ప్రాంగణాన్ని తాత్కాలికంగా లాక్‌డౌన్‌ చేశారు. అధ్యక్ష భవనానికి సమీపంలోని లాఫాయెట్ స్క్వేర్ పార్క్ వద్ద ఈ ఘటన జరిగింది. వాహనం నుంచి దట్టమైన పొగలు వచ్చిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

వైట్‌హౌస్ చుట్టూ లాక్ డౌన్ చేసిన అధికారులు

Advertisement

పరిస్థితి గమనించిన సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు వైట్‌హౌస్ ప్రాంగణాన్ని లాక్‌డౌన్‌ చేశారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భవనంలో ఉన్నారు. ఇప్పటివరకు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు భద్రతా బలగాలు. సీక్రెట్ సర్వీస్ ప్రకారం.. అదే సమయంలో వైట్ హౌస్‌లో ఇలాంటి ఘటన జరిగింది. అమెరికా కాలమాన ప్రకారం సోమవారం ఉదయం 10 గంటలకు ఈ ఘటన జరిగింది.

ALSO READ: ఉక్కు కర్మాగారంలో భారీ పేలుడు.. 16 మంది మృతి, పేలుడు వెనుక ఏం జరిగింది?

Advertisement

లాఫాయెట్ స్క్వేర్‌కు ఉత్తరాన వెండి కలర్ సెడాన్ కారు సైన్‌ బోర్డును ఢీ కొట్టింది. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు, డ్రైవర్‌ను వాహనం నుండి బయటకు రమ్మని ఆదేశించారు. డ్రైవర్ బయటకు వచ్చిన తర్వాత పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో సీక్రెట్ సర్వీస్ అధికారులు, నేషనల్ గార్డ్ బలగాలు అతడ్ని రౌండప్ చేశాయి. లాఫాయెట్ స్క్వేర్ పార్కు వైట్ హౌస్‌కు ఎదురుగా ఉంది.

అధ్యక్ష భవన సముదాయానికి సమీపంలో బహిరంగ ప్రదేశం. ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో భద్రతను పెంచడంతోపాటు వైట్‌హౌస్ చుట్టూ తాత్కాలిక ఆంక్షలు విధించారు. కారును ప్రమాదవశాత్తు ఢీ కొట్టారా? ఉద్దేశ పూర్వకంగా చేసిందా? అనేది ఇంకా తెలియరాలేదు. యూఎస్ సీక్రెట్ సర్వీస్ వివరాల ప్రకారం.. వైట్ హౌస్ వద్ద ఒకే రోజు రెండు వేర్వేరు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఓ వ్యక్తి కారును ఫుట్‌పాత్‌పైకి నడపగా, మరొక వ్యక్తి అధ్యక్ష భవన సముదాయం ముందున్న లాఫాయెట్ పార్క్‌లోని బారికేడ్‌ను దాటించి నడిపాడు. రెండు సంఘటనలపై దర్యాప్తు జరుగుతోందని సీక్రెట్ సర్వీస్ ఓ ప్రకటనలో తెలిపింది.

 

Related News

ఉక్కు కర్మాగారంలో భారీ పేలుడు.. 16 మంది మృతి, పేలుడు వెనుక ఏం జరిగింది?

ప్రపంచాన్ని ఏలుతున్న AI కింగ్.. ఒక మహిళ వల్ల జైలుకు వెళ్లబోతున్నాడా?

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. అమెరికా చరిత్రలో భారీ వెనుకడుగు, తిరిగి పుంజుకుంటాం

జపాన్‌‌ను వణికించిన భారీ భూకంపం.. భారీగా షాపులు డ్యామేజ్, బుల్లెట్ రైల్లు నిలిపివేత

2028లో అమెరికాను ఏలేది ఎవరు? ట్రంప్ స్థానంలో ఈ ముగ్గురిలో ఒకరా?

ఇరాన్ ముందస్తు వ్యూహం.. యుద్ధానికీ అయోడిన్ టాబ్లెట్లకీ సంబంధమేంటి?

అమెరికా బంపరాఫర్.. ఇరాన్ అణు రహస్యాలు చెప్తే రూ.165 కోట్లు.. గిఫ్ట్‌గా యూఏస్ పౌరసత్వం!

Big Stories

Advertisement
×