Tsunami: అమెరికాలోని అలాస్కా రాష్ట్రం గుర్తుకు రావాల్సిందే. ఎందుకంటే అక్కడ సహజ సౌందర్యంతో పాటు భూకంపాలు, మంచు పర్వతాలు, హిమ నదులు, సముద్ర తీరాలు,ఇవన్నీ కలిసిన ఒక ప్రత్యేక భూభాగంగా చెప్పవచ్చు. కానీ, అలాస్కాలో ప్రపంచంలోని అందరి దృష్టిని ఆ ప్రాంతానికి మళ్లించింది. ఈ ఘటన గత ఆదివారం చోటుచేసుకుంది. జూనో నగరానికి దక్షిణంగా ఉన్న ట్రేసీ ఆర్మ్ అనే ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. అక్కడ కొండచరియల విరిగిపడటం వల్ల సముద్రంలో పెద్ద ఎత్తున అలలు ఎగసిపడుతూ, సునామీని తలపించే పరిస్థితి నెలకొంది. అలస్కా ప్రాంతంలో జనాభా పెద్దగా ఉండరు. పైగా ఇది రిమోట్ ప్లేస్.. అందుకే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అలాస్కా భూకంప పరిశోధకుల వివరించారు.
అలాస్కా ఎర్త్‌క్వేక్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 10న ఉదయం 5.30 గంటల సమయంలో సౌత్ సాయర్ గ్లేసియర్ వద్ద మట్టి, రాళ్లు, మంచు కదలిక మొదలైంది. ఈ కదిలిక సుమారు 100 మిలియన్ క్యూబిక్ మీటర్లుగా అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద పరిమాణంలో మట్టి, రాళ్లు, మంచు నీటిలో పడటంతో సముద్రంలో బలమైన భూకంపం ఏర్పడింది. సుమారు 60 నుండి 100 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగసిపడినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఆ సంఘటన చోటు చేసుకున్న ప్రదేశం చాలా దూరంలో ఉంది. ఆ సంఘటన జరిగినప్పుడు జనాభా, పర్యాటక నౌకలు కూడా లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అందువల్ల ప్రాణనష్టం జరగలేదు. అయితే భూకంపం వలన ఏర్పడిన సునామీ తరహా అలలు సమీపంలోని సాయర్ ఐలాండ్ వరకు చేరి, అక్కడ ఉన్న చెట్లు, తీరప్రాంతంలను ధ్వంసం చేశాయి.
కొన్ని ఫిషింగ్ బోట్లు కొద్దిదూరంలో ఉన్నప్పటికీ సమయానికి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. కొన్ని కయాకర్లు, ఫిషింగ్ బోట్ల వద్దకు దగ్గరగా వచ్చిన పెను ప్రమాదం నుంచి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఎవరికి ఏమీ కాలేదు. దీని వల్ల ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనకు కారణంగా హిమనదుల కరుగుదల, భూభౌతిక బలహీనత, సంఘటనకు ముందు నమోదైన వందల కొద్దీ భూ ప్రకంపనలు ప్రాథమిక పరిశీలనలో గుర్తించారు . ఈ ప్రకంపనలను ‘ప్రీకర్సరీ సీక్వెన్స్’ అని పిలుస్తారు. ఇవి ప్రధాన ల్యాండ్‌స్లైడ్‌కు ముందస్తు సంకేతాలని నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం శాస్త్రవేత్తలు డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు, సెన్సార్ల ద్వారా ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటన ప్రకృతి శక్తి ఎంత భయంకరమో మళ్లీ గుర్తు చేసింది. అదృష్టవశాత్తూ ఈసారి ప్రాణ నష్టం జరగలేదు. కానీ, భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ముందే గుర్తించే టెక్నాలజీ అభివృద్ధి అవసరం ఉందని నిపుణులు తెలిపారు.