War 2 Movie : టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ లెవల్లో క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో తారక్.. తొలిసారి హిందీలో నటించిన చిత్రం ‘వార్ 2’. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ అనగానే సినిమాపై అంచనాలు పెరిగాయి. అందులోను బాలీవుడ్ లో నెంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన స్పై యూనివర్స్ చిత్రం. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో పబ్లిక్ రివ్యూను చూస్తే తెలుస్తుంది.. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.. ఏంటంటే ఈ మూవీని కాపీ కొట్టారంటూ ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. అందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది..
లోకిని కాపీ కొట్టేశారా ముఖర్జీ?
భారీ యాక్షన్స్ సన్నివేశాల తో వస్తున్న మూవీలు ఈమధ్య కొన్ని కాపీ కొడుతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. అదేవిధంగా ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 మూవీ కి కూడా వినిపిస్తున్నాయి.. గతంలో ఎన్నడూ నటించని విధంగా ఎన్టీఆర్ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో నటించారు.. ఈ మూవీ లో ప్రతి సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. క్లైమాక్స్ సీన్ అయితే చెప్పనక్కర్లేదు.. అసలు ఊహించిన విధంగా ఉంటుంది. ఈ క్లైమాక్స్ సీన్ విజయ్ నటించిన మాస్టర్ మూవీని కాపీ చేసినట్లు తెలుస్తుందని కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై వార్ 2 టీం ఎలా స్పందిస్తుందో చూడాలి..
Also Read: యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..
వార్ 2 స్టోరీ…
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ మొదటిసారి నటించిన బాలీవుడ్ చిత్రం వార్ 2.. ఈ మూవీ విషయానికొస్తే.. ఇంటర్నేషనల్ డాన్ అయిన కలి చెందిన గ్యాంగ్ అతన్ని కాంటాక్ట్ అవుతుంది. ఇందులో భారత్, పాకిస్థాన్, ఫ్రాన్స్, చైనా, మయన్మార్ తదితర దేశాలకు చెందిన కీలక వ్యక్తులు ఇందులో సభ్యులుగా ఉంటారు. వీళ్లు దేశంలో అశాంతి, అలజడి రేకెత్తించి తమ చెప్పిన మాట వినే కీలు బొమ్మను నేతగా చేయాలనుకుంటారు. ఈ క్రమంలో ఈ కలి గ్యాంగ్ కబీర్ ను ఛీఫ్ కబీర్ గురువు అయిన కల్నల్ లూత్రాను చంపమని చెబుతుంది. కబీర్ వాళ్లు చెప్పినట్టే ఛీఫ్ ను చంపేస్తాడు. ఈ ‘రా’ ఏజెన్సీ కబీర్ ను పట్టుకొవడానికి షార్ప్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయిన విక్రమ్ ను పంపుతుంది.. ఈ క్రమంలో విక్రమ్ కు ఒక నిజం తెలుస్తుంది.. ఆ తర్వాత స్టోరీలో ఎన్ని మలుపులు తిరుగుతుంది. ఈ మూవీ మొత్తం యాక్షన్స్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని రివ్యూలు చెబుతున్నాయి. మరి ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.. అలాగే ఈ వీకెండ్ సినిమాకు భారీగా బుకింగ్స్ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా అందుతున్న టాక్ ప్రకారం ఎన్టీఆర్ ఖాతాలో మరో హిట్ పడినట్లే..
Master climax scene copy 👍#SuperCup#CoolieDisaster#War2 #War2Review pic.twitter.com/wnp2dC3D82
— ᗰIᑕᕼᗩEᒪ 🥊 (@Michealtweets) August 14, 2025