BigTV English
Advertisement

Plateau School Collapse: కుప్పకూలిన స్కూల్.. 22 మంది పిల్లలు మృతి.. శిథిలాల్లో 100 మంది!

నైజీరియాలో ఓ రెండు అంతస్తుల స్కూలు భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 22 విద్యార్థులు చనిపోగా.. 100 మందికిగా శిథిలాల్లోనే చిక్కుకొని ఉన్నారు. ఈ ఘటన శుక్రవారం, ప్లాట్యూ స్టేట్.. బుసా బుజీ కమ్యూనిటీ ప్రాంతంలో జరిగింది. ఉదయం పిల్లలు స్కూలుకు వచ్చిన కొంతసేపు తరువాతే ఘటన జరగింది.

Plateau School Collapse: కుప్పకూలిన స్కూల్.. 22 మంది పిల్లలు మృతి.. శిథిలాల్లో 100 మంది!

Plateau School Collapse: నైజీరియాలో ఓ రెండు అంతస్తుల స్కూలు భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 22 విద్యార్థులు చనిపోగా.. 100 మందికిగా శిథిలాల్లోనే చిక్కుకొని ఉన్నారు. ఈ ఘటన శుక్రవారం, ప్లాట్యూ స్టేట్.. బుసా బుజీ కమ్యూనిటీ ప్రాంతంలో జరిగింది. ఉదయం పిల్లలు స్కూలుకు వచ్చిన కొంతసేపు తరువాతే ఘటన జరగింది.


స్కూలు భవనం కూలిందని సమాచారం అందుకోగానే పోలీసులు, రక్షణ బలగాలు, వైద్య సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారని నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేమెంట్ ఏజెన్సీ తెలిపింది. చాలామంది గ్రామస్థులు స్కూలు వద్దకు చేరుకొని.. శిథిలాల్లో చిక్కుకొని ఉన్నవారిని బయటికి తీయడానికి సహాయం చేశారు.

Also Read: మరోసారి బయటపడిన బైడెన్ మతిమరుపు.. జెలెన్‌స్కీని పుతిన్ అంటూ సంబోధన!


కూలిన భవనం నుంచి ఇప్పటికే 154 మందిని కాపాడి వెలికి తీశామని.. అందులో 132 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్లాటూ స్టేట్ కమిషనర్ మూసా అషోమ్స్ చెప్పారు. గాయపడిన వారికి.. ఎటువంటి ఖర్చులు లేకుండా వెంటనే వైద్యం అందించమని సమీప ఆస్పత్రులకు ఆదేశాలు జారీచేశామని అన్నారు.

స్కూలు భవనం చాలా పాతబడిందని.. భవనంలో చాలా భాగాలు బలహీనంగా ఉండడం, నదీ ఒడ్డుకు స్కూలు భవనం సమీపంగా ఉండడమే భవనం కూలిపోవడానికి కారణమని ప్రభుత్వ అధికారులు అభిప్రాయపడ్డారు.

ఆఫ్రికా ఖండంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం నైజీరియా. భవనాలు కూలిపోయే దుర్ఘటనలు గత రెండు సంవత్సరాలుగా ఎక్కువగా జరుగుతున్నాయి. భవన నిర్మాణ నియమాలు సరిగా పాటించకపోవడం వల్లే ఈ దుర్ఘటనలు జరగడానికి కారణమని అధికారులు చెబుతున్నారు.

Tags

Related News

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Big Stories

×