BigTV English

Office: వారానికి 4 రోజులే ఆఫీస్.. ఖుషీ.. ఖుషీగా ఉద్యోగులు

Office: వారానికి 4 రోజులే ఆఫీస్.. ఖుషీ.. ఖుషీగా ఉద్యోగులు

Office: ఉద్యోగులు ఇళ్లకంటే ఆఫీసులోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. మరికొంత మందైతే ఇంటికి వెళ్లినా కూడా ఆఫీస్ పనిలోనే నిమగ్నమైపోతున్నారు. నిత్యం ల్యాప్‌టాప్‌లతో కుస్తీ పడుతున్నారు. దీంతో వర్క్ ప్రెజర్ పెరిగి వ్యక్తి గత జీవితానికి దూరమవుతున్నారు. కుటుంబ సభ్యులతో గడిపే సమయాన్ని కోల్పోతున్నారు. ఈక్రమంలో బ్రిటన్‌కు చెందిన కొన్ని కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.


ఉద్యోగులకు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిదినాలు ఇంటే ఎటువంటి ఫలితాలు వస్తాయనే దానిపై ట్రయల్ నిర్వహించాయి. ఈ ట్రయల్‌లో ఊహించని రీతిలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. మొత్తం 61 కంపెనీలు గతేడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు 6 నెలలు ఈ ట్రైయల్ నిర్వహించాయి.

ఇందులో మొత్తం 30 వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఒకరోజు వర్కింగ్ డే తగ్గినా కూడా వారి వేతనంలో ఎటువంటి కోత విధించలేదు. పూర్తి జీతాన్ని చెల్లించారు. ఇక ఆరు నెలల పాటు జరిగిన ఈ ట్రయల్‌లో ఆశాజనక ఫలితాలు వచ్చాయని కంపెనీలు తెలిపాయి.


భవిష్యత్తులో కూడా వారంలో నాలుగు రోజుల పనిదినాలనే అమలు చేస్తామని ట్రయల్‌లో పాల్గొన్న 91 శాతం కంపెనీలు ప్రకటించాయి. మరో 5 శాతం కంపెనీలు పాత పద్ధతినే కొనసాగిస్తామని స్పష్టం చేయగా.. 4 శాతం కంపెనీలు మాత్రం సందిగ్ధంలో ఉన్నాయి.

అటు నాలుగు రోజులే పనిదినాలు ఉండడంతో ఉద్యోగులు కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారని కంపెనీలు తెలిపాయి. అలాగే ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడిందని.. ఒత్తిడి, అలసట, నిద్ర సమస్యలు క్రమంగా తగ్గిపోయాయని వెల్లడించాయి. ఇంటి పనులు, పిల్లలను చూసుకునేందుకు ఉద్యోగులకు సమయం దొరుకుతుందని చెప్పాయి.

Tags
Test

Related News

Theaters Attack: కెనడాలో ఘోరం.. భారతీయ చిత్రాల థియేటర్లపై దాడులు, పవన్ సినిమాకు

Putin Vs Trump: ట్రంప్‌పై పుతిన్ ఆగ్రహం.. భారత్‌ తలొగ్గదు, అమెరికాకు పెద్ద దెబ్బ

Pakistan: ఆయనో సేల్స్ మెన్, ఈయనో మేనేజర్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ప్రధానిపై సెటైర్లు

America News: ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న విమానాలు, ఎలా జరిగింది? వైరల్ అవుతున్న వీడియో

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

Big Stories

×