BigTV English

40 Haitian migrants die: హైతీలో దారుణం, అగ్ని ప్రమాదానికి గురైన వలసదారుల బోటు

40 Haitian migrants die: హైతీలో దారుణం, అగ్ని ప్రమాదానికి గురైన  వలసదారుల బోటు

40 Haitian migrants die: హైతీ దేశానికి చెందిన దాదాపు 80 మందితో వెళ్తున్న బోటు సముద్రంలో అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో దాదాపు 40 వరకు మృతిచెందారు. మరో 40 మందిని హైతీ తీర రక్షణ దళం కాపాడింది.


ఉత్తర హైతీలోని సెయింట్ మిచెల్ పోర్టు నుంచి 80 మందితో బయలుదేరింది ఈ పడవ. కాయ్ కోస్, టర్క్స్‌ నగరానికి ఈ బోటు వెళ్తోంది. ఈ విషయాన్ని కరేబియన్ మైగ్రేషన్ అధారిటీ వెల్లడించింది. గాయపడిన 11 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

బోటు ట్రావెల్ సమయంలో అందులోని కొందరు వెళ్తున్న మార్గం కోసం కొవ్వొత్తులను వెలిగించడానికి అగ్గిపెట్టెను ఉపయోగించారు. గాలికి కొవ్వొత్తులు కింద పడడంతో బోటులోని గ్యాసోలిన్‌తో నింపిన డ్రమ్ములకు అంటుకుందని అంటున్నారు. దీని కారణంగానే పేలుడు సంభవించి బోటు తగలబడి పోయిందన్నది క్షతగ్రాతులు చెబుతున్నారు. మృతి చెందినవారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.


ALSO READ: అమెరికాకు భారత కొత్త రాయబారిగా వినయ్ క్వాత్రా

హైతీని ఆ దేశ ప్రజలు విడిచిపెట్టడానికి కారణాలు లేకపోలేదు. కొన్ని నెలలుగా అక్కడ కొన్ని గ్యాంగులు చెలరేగిపోతున్నాయి. హింసకు దిగుతున్నాయి.. దీని ఫలితంగా అక్కడి ప్రజలు చిన్నారులను పట్టుకుని బోట్లపై పొరుగుదేశాలకు వలసపోతున్నారు. ఈ క్రమంలో ఘటన చోటు చేసుకుంది. ఒక్క జూలైలో వందలాది మంది కెన్యా, మిగిలిన దేశాలకు చేరుకున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నమాట.

Tags

Related News

Theaters Attack: కెనడాలో ఘోరం.. భారతీయ చిత్రాల థియేటర్లపై దాడులు, పవన్ సినిమాకు

Putin Vs Trump: ట్రంప్‌పై పుతిన్ ఆగ్రహం.. భారత్‌ తలొగ్గదు, అమెరికాకు పెద్ద దెబ్బ

Pakistan: ఆయనో సేల్స్ మెన్, ఈయనో మేనేజర్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ప్రధానిపై సెటైర్లు

America News: ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న విమానాలు, ఎలా జరిగింది? వైరల్ అవుతున్న వీడియో

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

Big Stories

×