BigTV English

Telangana: భారీ వర్షాలు..అందుబాటులో ఉండాలని అధికారులకు ఉత్తమ్ సూచన

Telangana: భారీ వర్షాలు..అందుబాటులో ఉండాలని అధికారులకు ఉత్తమ్ సూచన

Minister Uttam kumar reddy latest news(TS today news): వాతావరణ శాఖ తెలంగాణకు భారీ వర్ష సూచన ఇవ్వడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆయా నియోజకవర్గాలలో ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించాలని, హెల్ప్ లైన్ నంబర్లు ఇచ్చి రెస్పాండ్ అవ్వాలని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అందరూ లీవ్ లు, సెలవలు రద్దు చేసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు వాగులు, చెరువులు పర్యవేక్షించాలని అన్నారు. ఎక్కడెక్కడ చెరువు కట్టలు బలహీనంగా ఉన్నాయో తెలుసుకుని వాటికి అవసరమైతే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని..లోతట్టు ప్రాంత ప్రజలను అత్యవసర పరిస్థితిలో ఖాళీ చేయించి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని పలు రాష్ట్ర సీఈలకు సూచించారు. అధికారులంతా జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనే ఉండి ఎప్పటికప్పుడు వర్షాల పరిస్థితి పర్యవేక్షించాలని..సహాయక బృందాలను అప్రమత్తం చేయాలని అన్నారు.


భారీ వర్ష సూచన

వర్షాల పరిస్థితి, పై నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు గమనిస్తూ మెల్లిగా గేట్లు ఎత్తి వేయాలని సూచిస్తున్నారు. బంగాళా ఖాతంలో వాయుగుండం , రుతుపవనాల కదలిక చురుకుగా ఉండటం తదితర కారణాలతో రాగల నాలుగు రోజులు తెలంగాణకు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచనలు చేసింది. ఎట్టి పరిస్థితిలోనూ ప్రజల ప్రాణాలు, ఆస్తులకు నష్టం వాటిల్లకుండా చూడాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ సూచించారు. ముఖ్యంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడే తాత్కాలికంగా ప్రాధమిక వైద్య పరీక్షల కిట్, ఆహార పదార్థాలు, పాలు తదితరాలను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. జిల్లాలలో విద్యుత్ సిబ్బంది కూడా చురుకుగా విధులలో పాల్గొనాలని సూచించారు. భారీ వర్షాలు, వరదలు వస్తే కరెంట్ తీగలు తెగిపడిపోకుండా చూడాలని..అవసరమైతే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని అన్నారు.


సెవవలు క్యాన్సిల్

జిల్లాలకు సంబంధించిన అధికారులంతా అప్రమత్తంగా వ్యవహరించాలని, నిర్లక్షంగా వ్యవహరిస్తే వారిని సస్సెండ్ చేస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పెద్ద వాగు కట్ట తెగి వరదల్లో చిక్కుకున్న వారిని యుద్ధ ప్రాతిపదికన వారికి సహాయ సహకారాలు అందించాలని అంటున్నారు. జిల్లాలలో పోలీసు యంత్రాంగం, శానిటరీ, వైద్య శాఖ అధికారులంతా తమ సెలవలు రద్దు చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచిస్తున్నారు.

Related News

Rain Alert: మరి కాసేపట్లో భారీ వర్షం.. త్వరగా ఆఫీసులకు చేరుకోండి, లేకపోతే…

Telangana Congress: కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్లుగా ఫోకస్ అవుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్

Bhuvanagiri collector: పల్లెకు వెళ్లిన భువనగిరి కలెక్టర్.. సమస్యలన్నీ ఫటాఫట్ పరిష్కారం!

BRS BC Meeting: బీఆర్ఎస్ కరీంనగర్ బీసీ సభ వాయిదా..? కాంగ్రెస్ ధర్నా సక్సెసే కారణమా?

CM Revanth Reddy: కేంద్రంలో బీజేపీని గద్దె దింపుతాం.. సిఎం రేవంత్ రెడ్డి

Konda Surekha: బీజేపీపై బిగ్ బాంబ్ విసిరిన కొండా సురేఖ.. రాష్ట్రపతినే అవమానించారంటూ కామెంట్స్!

Big Stories

×