BigTV English

Heart Transplant Patient: అది మామూలు గుండె కాదు.. 35 ఏళ్లుగా..

Heart Transplant Patient: అది మామూలు గుండె కాదు.. 35 ఏళ్లుగా..

Longest Surviving Heart Transplant Patient: గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంటే ఎన్నేళ్లు బతకొచ్చు..? ఐదేళ్లు.. పోనీ పదేళ్లు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న వారిలో సగం మంది.. ఆ శస్త్ర చికిత్స తర్వాత కూడా 11 ఏళ్ల పాటు నిక్షేపంగా బతకొచ్చని గణాంకాలు చెబుతున్నాయి. సర్జరీ అయిన తొలి సంవత్సరం గట్టెక్కితే చాలు.. 13.5 ఏళ్ల పాటు జీవితాన్ని కొనసాగించే చాన్స్ ఉంది.


నెదర్లాండ్స్‌కు చెందిన 57 ఏళ్ల బెర్ట్ జాన్సెన్ (Bert Janssen) మాత్రం సర్జరీ అయిన 39 ఏళ్ల తర్వాత కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు. గుండెమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న వారిలో ఇంత సుదీర్ఘకాలం ఎవరూ బతకలేదు. ఆ గుండె మామూలుది కాదు.. అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలో ఇదో రికార్డు. అందుకే ఆయన పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది.

1980లో లండన్‌లో ఆయనకు ఆపరేషన్ జరిగింది. హేర్‌ఫీల్డ్ ఆస్పత్రిలో జాన్సెన్‌కు డోనర్ హార్ట్‌ను విజయవంతంగా మార్పిడి చేశారు.


17 ఏళ్ల వయసులో ఫ్లూ వంటి లక్షణాలు కనిపించడంతో వైద్యులను జాన్సెన్ సంప్రదించారు. కార్డియోమయోపతి అనే అరుదైన గుండెజబ్బు బారిన పడినట్టు వైద్యులు నిర్థారించారు. ఈ వ్యాధి ఉంటే.. శరీరం అంతటికీ రక్తాన్ని పంపింగ్ చేసే సామర్థ్యాన్ని గుండె కోల్పోతుంది. దాంతో గుండె మార్పిడి శస్త్రచికిత్స తప్పదని సూచించారు.

అప్పటికి ఆ సర్జరీ నెదర్లాండ్స్‌లో అందుబాటులో లేకపోవడంతో.. లండన్‌లోని హేర్‌ఫీల్డ్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీల్లో ఆరితేరిన ప్రొఫెసర్ సర్ మాగ్డి యాకూబ్ నేతృత్వంలో 6 జూన్ 1984లో ఆపరేషన్‌ను నిర్వహించారు.

అప్పటికి జాన్సెన్‌కు 18 ఏళ్లు. ఆ సమయంలో అనుకున్నవన్నీ చకచకా సాగిపోయాయని జాన్సెన్ గుర్తు చేసుకున్నాడు. ఆయన ఆస్పత్రిలో చేరిన వారం రోజులకే లండన్‌లో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. అందులో మృతి చెందిన వారిలో ఒకరి గుండె అన్ని విధాలా సరిపోవడంతో సర్జరీ చేశారని అన్నారు. ట్రాన్స్‌ప్లాంట్ అనంతరం ఎంతో మెరుగైన జీవనం లభించిందని టెన్నిస్, వాలీబాల్ ఆడగలిగానని, ఫుల్ టైం ఉద్యోగం కూడా చేయగలిగానని వివరించారు.

1996లో పెట్రాను పెళ్లి చేసుకోవడమే కాదు.. 1996, 2000లో ఇద్దరు కొడుకులు కూడా జాన్సెన్‌కు జన్మించారు. ప్రస్తుతం బ్రిటన్‌లో గుండె మార్పిడి సర్జరీలో కోసం 7,314 మంది క్యూలో ఉన్నారు. హేర్‌ఫీల్డ్ ఆస్పత్రిలో జాన్సెన్‌కు నిర్వహించింది 107వ సర్జరీ.

Related News

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Big Stories

×