BigTV English

RGV’s Vyooham Movie: ఆర్జీవి ‘వ్యూహం’ సినిమాకు గ్రీన్ సిగ్నల్.. రిలీజ్‌కు రెడీ..!

RGV’s Vyooham Movie: ఆర్జీవి ‘వ్యూహం’ సినిమాకు గ్రీన్ సిగ్నల్.. రిలీజ్‌కు రెడీ..!
Vyooham Movie

Ram Gopal Varma’s Vyooham Movie Ready to Release: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ చిత్రం ‘వ్యూహం’. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా దర్శకుడు ఆర్జీవీ తెరకెక్కిస్తున్నాడు. వాస్తవానికి ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇపాటికి రిలీజ్‌ కావాల్సింది. కానీ ఈ మూవీపై ఫస్ట్ నుంచి విమర్శలు తలెత్తడంతో రిలీజ్‌కు బ్రేక్ పడింది.


ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్‌పై చాలా విమర్శలు వచ్చాయి. టీజర్‌లో తమ పార్టీకి చెందిన నాయకులను కించపరిచే విధంగా కొన్ని సీన్లు ఉన్నాయని ఆరోపిస్తూ.. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో పాటు మరికొందరు సినిమాను విడుదల చేయవద్దంటూ కోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. దీంతో ఈ మూవీ విడుదలపై జాప్యం ఎదురైంది.

లోకేష్ పిటిషన్‌తో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తూ సినిమా విడుదలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించిన నిర్మాత దాసరి కిరణ్.. తమ సినిమా సరైన సమయానికి విడుదల కాకపోతే చాలా నష్టం వాటిల్లుతుందని కోర్టును ఆశ్రయించాడు.


READ MORE: Vyuham Movie : “వ్యూహం” విడుదలపై ఉత్కంఠ.. లైన్ క్లియర్ అవుతుందా ?

దీంతో సినిమా యూనిట్ నుంచి పిటిషన్‌లు దాఖలు కావడంతో మరోసారి హైకోర్టు సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. వ్యూహం సినిమాను మరోసారి సమీక్షించి సినిమాకు సర్టిఫికేట్‌ను జారీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కోర్టు నిర్ణయంతో వ్యూహం సినిమాకు తాజాగా సెన్సార్ నిర్వహించారు.

ఇందులో భాగంగా సెన్సార్ బోర్డు వ్యూహం సినిమాకు యూ సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. హైకోర్టు సూచనలతో రెండోసారి కూడా సెన్సార్ బోర్డు వ్యూహం సినిమాకు క్లియెరెన్స్ ఇచ్చింది. దీంతో ఈ సినిమాను ఫిబ్రవరి 16న రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత దాసరి కిరణ్ తెలిపారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×