Big Stories

Israel Strikes: మరోసారి సిరియాపై దాడి చేసిన ఇజ్రాయెల్.. 42 మంది మృతి

Israel StrikesIsrael Strikes: ఇజ్రాయెల్ మరోసారి సిరియాపై రెచ్చిపోయింది. ఓ పక్క హమాస్ తో యుద్ధం జరుగుతుండగానే సిరియాపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. సిరియాలో అతిపెద్ద నగరమైన అలెప్పోపై ఇజ్రాయెల్ దళాలు దాడి చేశాయి. అయితే ఈ దాడిలో 42 మంది మృతి చెందారు.

- Advertisement -

హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇజ్రాయెల్ దళాలు సిరియాపై దాడి చేశాయి. ఈ దాడిలో మొత్తం 42 మంది మృతి చెందగా.. వారిలో 36 మంది సిరియా సైనికులే ఉన్నట్లు ఓ యుద్ధ పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది.

- Advertisement -

ఇజ్రాయెల్ దాడిలో సిరియా సైన్యం ఈ స్థాయిలో ప్రాణనష్టం వాటిల్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. అలెప్పో విమానాశ్రయం సమీపంలోని హెజ్ బొల్లాకు చెందిన రాకెట్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ విషయాన్ని బ్రిటన్ ఆధారిత సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది.

ఇరాన్ కు అనుకూలంగా ఉన్న సిరియా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం ఈ దాడులు జరిపిందని బ్రిటన్ సంస్థ పేర్కొంది. అయితే తమ సైనికులు మృతిచెందినట్లు సిరియా సైన్యం కూడా అధికారికంగా ప్రకటించింది.

Also Read: Arvind Kejriwal Arrest: అమెరికా, జర్మనీ బాటలో నడిచిన యూఎన్.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందన

అయితే ఈ దాడుల్లో ఇజ్రాయెల్ సైన్యంతో పాటుగా స్థానిక తిరుగుబాటు దళాలు కూడా దాడి చేసినట్లు సిరియా పేర్కొంది. ఈ దాడి సిరియా సైనికులతో పాటుగా సాధారణ పౌరులు కూడా కొంత మంతి మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News