BigTV English

Tapsee Pannu: దాంతో రొమాన్స్ ఎప్పటికీ తనివితీరదు

Tapsee Pannu: దాంతో రొమాన్స్ ఎప్పటికీ తనివితీరదు


Tapsee Pannu: సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు టాలీవుడ్ లో ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో  తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఈ సినిమా తరువాత స్టార్ హీరోలతో సినిమాలు చేసినా కూడా తాప్సీకి ఆశించిన స్టార్ డమ్ దక్కలేదు. దీంతో బాలీవుడ్ బాట పట్టిన ఈమె అక్కడ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

ఇక ఈమధ్య తాప్సీ పెళ్లి వార్తలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డెన్మార్క్ దేశానికి చెందిన బ్యాడ్మింటన్  ఆటగాడు మథియాస్ బోతో  తాప్సీ చాలాకాలంగా రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే.  అయితే ఈ మధ్యనే ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారని వార్తలు వెలువడ్డాయి. మార్చి 20వ తేదీన ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుపుకొని, మార్చి 23వ తేదీన ఉదయపూర్ లో వీరి వివాహం అత్యంత బంధుమిత్రుల మధ్య జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి.అయితే ఇప్పటివరకు కూడా ఈ విషయంపై తాప్సీ స్పందించింది లేదు.


ఇక తాజాగా పెళ్లి రూమర్స్ తర్వాత మొట్టమొదటిసారి తాప్సీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ఈ చేసింది.” చీరతో రొమాన్స్ ఎప్పటికీ తనివి తీరదు” అని అర్థం వచ్చేలాగా ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.  ఈ ఫోటోలలో చీర మీద బ్లాక్ కలర్ సూట్ వేసుకుని హొయలు పోతూ కనిపించింది. ఈ ఫోటోలలో గమనించాల్సిన విషయం ఏంటంటే ఆమె చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ ఉండడం. అంటే తాప్సీ తన పెళ్లి విషయం చెప్పకనే చెప్పుకొచ్చిందని అభిమానులు చెప్పకువస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ జంట ముందు ముందు అయినా బయటపడతారా.. ? లేకపోతే ఇలాగే రహస్యంగా పిల్లలను కూడా కనేస్తారా ..? అనేది తెలియాల్సి ఉంది.

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×