E-Paper
Advertisement

Australian Beach Shooting: ఆస్ట్రేలియా బీచ్‌లో కాల్పులు.. 10 మంది టూరిస్టులు మృతి!

Australian Beach Shooting: ఆస్ట్రేలియా బీచ్‌లో కాల్పులు.. 10 మంది టూరిస్టులు మృతి!
Advertisement

Australian Beach Shooting: ఆస్ట్రేలియాలోని బాండి బీచ్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డాడు. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందారు. పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో బీచ్‌లోకి ప్రవేశించిన ఇద్దరు గన్‌మెన్లు ఒక్కసారిగా ఫైరింగ్‌ చేశారు. దీంతో వందల మంది పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. ఆదివారం కావడంతో బాండి బీచ్ కు భారీగా పర్యాటకులు వచ్చారు. పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు వినిపించారు. ఇద్దరు దుండగులు భారీ గన్ లతో టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఓ వ్యక్తి సాహసం చేసి షూటర్ నుంచి గన్ లాక్కుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

50 మందికి పైగా కాల్పులు

Advertisement

సిడ్నీలోని బాండి బీచ్‌లో ఇద్దరు ముష్కరులు కాల్పులు తెగబడడంతో 10 మంది టూరిస్టులు మరణించారు. ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. బాండి బీచ్ లో దృశ్యాలు “దిగ్భ్రాంతికరమైనవి, చాలా బాధాకరం” అని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ పోస్ట్ చేశారు. పోలీసులు, రెస్క్యూ ఫోర్సెస్ టూరిస్టులను కాపాడటానికి రంగంలోకి దిగారని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ప్రధాని అన్నారు. బీచ్ చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

యూదుల బీచ్ కార్యక్రమంలో

ఆదివారం మధ్యాహ్నం 2.17 గంటల ప్రాంతంలో.. న్యూ సౌత్ వేల్స్ పోలీసులు బాండి బీచ్‌లో జరిగిన కాల్పుల గురించి పోస్టు పెట్టారు. కాల్పులు జరిపిన ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ ఆపరేషన్ కొనసాగుతోందని, ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని ప్రజలను కోరారు. ఎనిమిది రోజుల యూదుల పండుగ హనుక్కా మొదటి రోజే కాల్పులు జరిగాయి. యూదుల పండుగ ప్రారంభానికి గుర్తుగా బీచ్ కార్యక్రమం కోసం వందలాది మంది తరలివచ్చారు. ఈ సమయంలో ఇద్దరు ముష్కరులు కాల్పులు జరిపారని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదించింది.

పిల్లలు, పెద్దలపై విచక్షణారహితంగా

Advertisement

ప్రత్యక్ష సాక్షి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. కాల్పులు జరిపిన వ్యక్తులు పిల్లలు, పెద్దలు అని చూడకుండా విచక్షణారహితంగా కాల్పులు జరిపారని చెప్పారు. కాల్పులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలో ఓ దుండగుడు గన్ తో కాల్పులు జరుపుతున్నట్లు కనిపిస్తుంది.

Also Read: South Africa: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన నాలుగు అంతస్తుల ఆలయం.. శిథిలాల కింద అనేక మంది!

ప్రతిపక్ష నాయకుడు సుస్సాన్ లే మాట్లాడుతూ.. ఆస్ట్రేలియన్లు తీవ్ర శోకంలో ఉన్నారన్నారు. ఆస్ట్రేలియన్ సమాజంపై హింసాత్మక దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. యూదుల పండుగను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడికి పాల్పడ్డారన్నారు.

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×