South Africa: సౌతాఫ్రికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. క్వాజులు నాటల్ ప్రావిన్స్‌లో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల న్యూ అహోబిలం ఆలయం కుప్పకూలింది. అయితే ఇస్కోన్ (ISKCON) సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ ఆలయం నాలుగు అంతస్తుల ఎత్తులో ఉంది.
నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలోనే ఈ భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో 52 ఏళ్ల భారత సంతతి వ్యక్తి సహా మరో ముగ్గురు మృతిచెందారు. మృతులంతా నిర్మాణ కార్మికులేనని భావిస్తున్నారు.
అయితే కూలిపోయిన ఈ నిర్మాణాన్ని స్థానికంగా న్యూ అహోబిలం ఆలయంగా పిలుస్తున్నారు. భవనం కూలిపోగానే పెద్ద ఎత్తున శిథిలాలు పేరుకుపోయాయి. వెంటనే అప్రమత్తమైన స్థానిక అత్యవసర సేవల బృందాలు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
ప్రమాద సమయంలో శిథిలాల కింద మరికొంత మంది కార్మికులు చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు అనుమానించారు. దీనితో, వారిని సురక్షితంగా బయటకు తీయడానికి రెస్క్యూ ఆపరేషన్ ప్రయత్నిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో శిథిలాలను తొలగించడానికి భారీ యంత్రాలను ఉపయోగించారు, ప్రాణాలతో ఉన్నవారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ ఘోర ప్రమాదానికి కారణాలు ఏమై ఉంటాయనే అంశంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఉన్నాయా, లేక భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యం జరిగిందా అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి భయం.. సెల్ టవర్ ఎక్కి హల్‌చల్!
ఆలయాన్ని నిర్మిస్తున్న సంస్థ ప్రతినిధులు, కాంట్రాక్టర్ల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ దుర్ఘటన కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు స్థానిక సంస్థలు, ఆలయ కమిటీ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సౌతాఫ్రికాలో కూలిన ఆలయం.. మృతుల్లో భారత సంతతి వ్యక్తి..!
క్వాజులు నాటల్ ప్రావిన్స్‌లో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల అహోబిలం ఆలయం
ఈ ఘటనలో 52 ఏళ్ల భారత సంతతి వ్యక్తి, మరో ముగ్గురు మృతి
కార్మికులు విధుల్లో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఆలయం
శిథిలాల కింద మరికొంత మంది… pic.twitter.com/1b3ZJu9kFz
— BIG TV Breaking News (@bigtvtelugu) December 14, 2025