BigTV English

Sheikh Hasina:షేక్ హసీనాను బంగ్లాదేశ్ కు రప్పించేందుకు యత్నాలు

Sheikh Hasina:షేక్ హసీనాను బంగ్లాదేశ్ కు రప్పించేందుకు యత్నాలు

Bangladesh take necessary steps to extradite deposed on Sheikh Hasina: రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్ ను అస్తవ్యస్తం చేశాయి. ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమై చివరికి ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయడమే కాదు..విదేశాలకు పారిపోయి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బంగ్లాదేశ్ లో జరిగిన హింసాత్మక సంఘటనలతో షేక్ హసీనా ఆమె అనుచరులపై హత్యా నేరం కేసులు నమోదు చేశారు బంగ్లా దేశ్ ప్రస్తుత పాలకులు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలతో భీతిల్లిన షేక్ హసీనా భారత్ కు పారిపోయి ..అప్పటినుంచే ఇక్కడే తలదాచుకుంటున్నారు. షేక్ హసీనా గత పదిహేనేళ్లుగా భారత్ కు మద్దతుదారుగా ఉంటున్నారు. దీనితో తన ప్రాణాలకు రక్షణ ఇక్కడే సాధ్యం అని భావించారామె.


హత్యారోపణ కేసులు

హసీనా, ఆమె అనుచరులపై సామూహిక హత్యల నేరారోపణకు సంబంధించి పలు కేసులు బుక్కయ్యాయి. తప్పనిసరిగా ఆమెను స్వదేశం పిలిపించి విచారిస్తామని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం తెలిపారు. బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం వచ్చాక తాజుల్ ను చీఫ్ ప్రాసిక్యూటర్ గా నియమించింది. ఈ విషయంలో భారత రాయబారితో మాట్లాడి నిందితులను అప్పగించేలా ఒప్పందం చేసుకుంటామని తాజుల్ తెలిపారు. అయితే బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం రిజర్వేషన్ల అంశంలో విద్యార్థి సంఘాల ఆందోళనలు..ఆ తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలలో దాదాపు వెయ్యి మందికి పైగా మృతి చెందినట్లు వార్తా కథనాలు వచ్చాయి. దాదాపు రెండు నెలలుగా జరిగిన మారణ హోమానికి షేక్ హసీనా, ఆమె అనుచరులే కారణమని మరో తొమ్మిది మందిపై బంగ్లా అధికారులు కేసులు నమోదు చేయడం గమనార్హం.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×