BigTV English

Rahulgandhi: అమెరికాలో రాహుల్‌గాంధీ.. కీలక వ్యాఖ్యలు, రాజకీయాల్లో గౌరవం లేదంటూ..

Rahulgandhi: అమెరికాలో రాహుల్‌గాంధీ.. కీలక వ్యాఖ్యలు, రాజకీయాల్లో గౌరవం లేదంటూ..

Rahulgandhi: ఏ ప్రాంతమైన కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ టార్గెట్ ఒక్కటే. అదే బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వైఖరిని తూర్పారబట్టారు. భారత దేశ రాజకీయ వ్యవస్థలో గౌరవం అనేది లేదని తేల్చేశారు.


కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. టెక్సాస్‌లోని ఇండో- అమెరికా కమ్యూనిటీ ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారాయన. దేశానికి సంబంధించి చాలా విషయాలు బయటపెట్టారు. ప్రధాని నరేంద్రమోదీని టార్గెట్ చేస్తూ కీలక విషయాలు ప్రస్తావించారాయన.

ALSO READ: బోగీల మధ్య ఊడిన కప్లింగ్.. రెండుగా విడిపోయిన ట్రైన్


భారతదేశ రాజకీయ వ్యవస్థలో ప్రేమ, గౌరవం అనేది లేదని తేల్చిపారేశారాయన. రాజకీయ నాయకులు కులమతాలు, భాషలు, రాష్ట్రాలకు అతీతంగా అందర్నీ ప్రేమించాలని.. ప్రస్తుతం అవేమీ కనిపించలేదని మనసులోని మాట బయపెట్టారు. వీటిని తిరిగి రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

భారత్ అంటే ఒకే ఆలోచనని ఆర్ఎస్ఎస్ నమ్ముతోందని, తాము మాత్రం బహుళ ఆలోచనలని భావిస్తున్నామన్నారు. చట్ట సభల్లో అందరికీ ప్రాతినిధ్యం ఉండాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. కులం, భాష, సంప్రదాయాలతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ అర్హులేనన్నారు. కానీ, భారత్‌లో అందుకోసం ఇప్పుడు పోరాటం చేయాల్సి వస్తుందన్నారు.

ప్రస్తుతం పాలకులు రాజ్యాంగంపై దాడి చేస్తున్నారన్నది నిన్నటి ఎన్నికల్లో ప్రజలందరికీ అర్థమైందన్నారు. పనిలోపనిగా భారతదేశానికి నైపుణ్యాల సమస్య ఉందని చాలా మంది చెబుతారని గుర్తు చేశారు రాహుల్ గాంధీ. దేశంలో నైపుణ్యాల సమస్య ఉందని తాను అనుకోవడం లేదన్నారు. నైపుణ్యం ఉన్న వ్యక్తుల పట్ల భారతదేశానికి గౌరవం లేదన్నారు.

రాజ్యాంగంపై దాడి చేసే వారెవరైనా మన సంప్రదాయంపై దాడి చేసినట్లేనని ప్రజలు అర్థం చేసుకున్నారని వివరించారు రాహుల్‌గాంధీ. అందుకే పార్లమెంటులోని తొలి ప్రసంగంలో తాను అభయముద్ర గురించి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. తెలుగు అంటే కేవలం భాష మాత్రమేకాదని ఒక చరిత్ర అని అన్నారు. హిందీతో పోల్చి తెలుగు ను తక్కువ చేస్తే ఆ ప్రాంతం, అక్కడి చరిత్ర ముఖ్యంకాదని చెప్పినట్లేనని అన్నారు.

ప్రపంచంలో చైనా ఆధిపత్యం ప్రస్తావించారు రాహుల్‌గాంధీ. దీనికారణంగా భారతదేశం, యుఎస్, ఇతర పశ్చిమాసియా దేశాలను నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తోందన్నారు. పెరుగుతున్న నిరుద్యోగాన్ని ఎదుర్కోవడానికి తయారీ రంగంలో భారతదేశం తన పాత్రను తిరిగి పొందాల్సిన అవసరాన్ని నొక్కి వక్కానించారు.

పాశ్యాత్య దేశాలతోపాటు ఇండియాకు నిరుద్యోగ సమస్య ఉందన్న రాహుల్, ప్రపంచంలోని చాలా దేశాలకు ఆ సమస్యలు లేదన్నారు. ముఖ్యంగా చైనా విషయంలో కూడా. ఈరోజు తయారీ రంగంపై చైనా ఆధిపత్యం చెలాయిస్తోందని గుర్తు చేశారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ఓవర్సీస్ అధ్యక్షుడు శ్యామ్ పెట్రోడాపై ప్రశంసల జల్లు కురిపించారు. రాహుల్ విద్యావంతుడని, మంచి ఆలోచనపరుడని తెలిపారు. ఆయన ఆలోచనలను లోతుగా ఉంటాయన్నారు. ఏ అంశంపైనా డీప్‌గా ఆలోచిస్తారని, ఆయన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదన్నారు.

 

Related News

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

Big Stories

×