E-Paper
Advertisement

BSF sends back: బంగ్లాదేశ్ సంక్షోభం, 1000 మంది బంగ్లాదేశీయులను అడ్డుకున్న బీఎస్ఎఫ్

BSF sends back: బంగ్లాదేశ్ సంక్షోభం, 1000 మంది బంగ్లాదేశీయులను అడ్డుకున్న బీఎస్ఎఫ్
Advertisement

BSF sends back Bangladeshis(International news in telugu): బంగ్లాదేశ్ నుంచి నిత్యం చాలామంది ఇండియాలోకి అక్రమంగా చొరబడుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా నివాసం ఉంటున్నారు. దేశంలోని పలుచోట్ల ఈ విషయం వెల్ల డైంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో సంక్షోభం నెలకొంది. ఆ పరిస్థితి నుంచి తేరుకునేందుకు ఆదేశానికి చాలా సమయం పట్టవచ్చని భావిస్తున్నారు.

పరిస్థితి గమనించిన 1000 మంది బంగ్లాదేశీయులు భారత్‌లో చొరబడేందుకు రెడీ అయ్యారు.వెంటనే అలర్టయిన బీఎస్ఎఫ్ బృందాలు వారిని అడ్డుకున్నట్లు  తెలుస్తోంది. వెస్ట్ బెంగాల్‌లోని కూచ్ బెహార్ జిల్లా సరిహద్దు ప్రాంతానికి 1000 మంది బంగ్లాదేశీయులు చేరుకున్నారు. వారంతా భారత్ భూభాగంలోకి ప్రవేశించేందుకు రెడీ అయ్యారు.

Advertisement

సరిహద్దుకు కేవలం 400 మీటర్ల దూరంలో వారంతా గుమ్మిగూడి ఉండడం గమనించాయి బీఎస్ఎఫ్ బృందాలు. అక్కడి నుంచి వారందరినీ వెనక్కి పంపించాయి. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ అధికారులు స్వయంగా వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం మొదలైన వెంటనే భారత్ అప్రమత్తమైంది.

బంగ్లాదేశీయులు చొరబడ కుండా సరిహద్దు వెంబడి భద్రతా బలగాలను మొహరించింది. అంతేకాదు బీఎస్ఎఫ్ చీఫ్ అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. చొరబాట్లదారులకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా బలగాలు సరిహద్దుల్లో కాపలా కాస్తున్నాయి.

Advertisement

ALSO READ: బ్రెజిల్‌లో ఘోరం.. 61 మంది మృతి..

పశ్చిమబెంగాల్‌లోని కూచ్ బెహార్ జిల్లా నుండి అస్సాంలో దక్షిణ సలామరా మంకాచార్ వరకు ఆ దేశంతో సరిహద్దు విస్తరించి ఉంది. భారతదేశం-బంగ్లాదేశ్ దేశాల మధ్య దాదాపు 509 కిలోమీటర్లు భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది బీఎప్ఎఫ్.

బంగ్లాదేశ్‌లో అశాంతి నెలకొన్న నేపథ్యంలో బెంగాల్‌ సరిహద్దులో రాష్ట్ర అధికారులు గ్రామస్థులతో సమా వేశాలు నిర్వహించారు. చొరబాట్లు, స్మగ్లింగ్ నిరోధించడానికి అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు. అంతేకాదు రాత్రిపూట కదలికలను నివారించడానికి షాపులను ముందుగానే మూసి వేయాలని సూచించారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×