Brazil airplane crashed: బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 61 మంది మృతి చెందారు. సావోపువాలోలోని నివాస ప్రాంతం విన్ హెడోలోలో ఈ ఘటన జరిగింది.
మరణించినవారిలో 57 మంది ట్రావెలర్స్, మరో నలుగురు విమాన స్టాప్ ఉన్నారు. ఈ విమానం బ్రెజిల్‌లో పరానా రాష్ట్రంలోని కాస్కావెల్ నుండి బయలుదేరి సావో పువాలోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయ సిబ్బంది, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి.
విమానం కూలిపోయే ముందు ఆకాశంలో పలుమార్లు చక్కర్లు కొడుతూ ఆ తర్వాత కూలిపోయినట్టు కనిపించింది. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. విమానం మంటల్లో దగ్ధమవుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ALSO READ: గాజాతో చర్చలకు ఇజ్రాయిల్ ప్రధాని గ్రీన్ సిగ్నల్
బ్రెజిల్ కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో విమానం కూలినట్టు తెలుస్తోంది. ఈ ఘటన జరగడానికి ముందు రాడార్ నుంచి సిగ్నల్ కోల్పోయింది విమానం. కేవలం 17 వేల అడుగుల ఎత్తు నుంచి కేవలం నిమిషం వ్యవధిలో భూమిపై కుప్పకూలింది.
విమానం ప్రమాదం గురించి తెలియగానే ఆ దేశ అధ్యక్షుడు లుయూజ్ లులా డసిల్వా షాక్‌కు గురయ్యారు. కాసేపటికి తేరుకున్న ఆయన.. విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపంగా ఒక నిమిషం మౌనం పాటించాలని ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
2283 నెంబరు విమానంలో మొత్తం 61 మంది ఉన్నట్లు సంబంధిత ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. ఘటన సమయంలో విమానంలో 57 మంది ప్రయాణికులు, నలుగురు స్టాఫ్ ఉన్నట్లు తెలిపింది.
అందులో ఉన్న అందరూ మరణించి ఉంటారని వెల్లడించింది.
⚡️#BREAKING
More insane footage of the Brazil airplane crash. #Brazil #Iran #Israel #Brazil #Brazilplanecrush pic.twitter.com/QlhppfT8Ly— Resistance War News (@medymanno) August 9, 2024