BigTV English

USA: సంక్షోభం ముంగిట అమెరికా.. ప్రపంచ దేశాల్లో టెన్షన్..

USA: సంక్షోభం ముంగిట అమెరికా.. ప్రపంచ దేశాల్లో టెన్షన్..
usa

USA: అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనబోతుందా? ఆ దేశ ఆర్థిక ప్రభావం ప్రపంచంపై ఏ మాత్రం ప్రభావం చూపుతుంది? అమెరికా ఆర్థిక మంత్రి యెలెన్ ఇటీవల కాంగ్రెస్‌కు రాసిన లేఖలో రుణపరిమితిని ప్రస్తావిస్తూ హెచ్చరించారు. అమెరికా రుణ పరిమితిని పెంచడంపై అధ్యక్షుడు, స్పీకర్ కెవిన్ మెకార్థీల మధ్య వైట్‌హౌస్‌లో చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలు ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిశాయి. డెమోక్రటిక్ పార్టీకి చెందిన బైడెన్, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి చెందిన మెకార్థీ మధ్య సఖ్యత కుదరకపోవడంతోనే చర్చలు కొలిక్కిరాలేదనే వాదనలు ఉన్నాయి.


ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్‌లో రిపబ్లికన్లకు మెజార్టీ ఉండడంతో మెకార్థీ స్పీకర్ పదవి నిర్వహిస్తున్నారు. అయితే మరో 10 రోజుల్లో రుణ పరిమితిని పెంచకపోతే అమెరికా ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లతో సహా విదేశాలు కొనుగోలు చేసిన బాండ్లకు కూడా చెల్లింపులు జరపలేకపోతుంది. అలా జరిగితే అమెరికానే కాక ప్రపంచాన్ని కూడా ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందని ఆర్థిక మంత్రి యెలెన్ ఇటీవల కాంగ్రెస్‌కు రాసిన లేఖలో హెచ్చరించారు. ఏడాది బడ్జెట్ కేటాయింపులకు ఆరేళ్లపాటు ఏటా 1 శాతం చొప్పున కోత పెట్టి డబ్బు ఆదా చేయాలని రిపబ్లికన్లు డిమాండ్ చేస్తున్నారు. అధ్యక్షుడు బైడెన్ మాత్రం 2024 బడ్జెట్‌ను 2023 స్థాయిలోనే కొనసాగిస్తామంటున్నారు.

2025 బడ్జెట్ ఖర్చులు 1 శాతానికి మించి పెంచబోమని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది రక్షణ, రక్షణేతర వ్యవయాలను 2023 స్థాయిలోనే పట్టి నిలిపితే 9 వేల కోట్ల డాలర్లు సేవ్ చేయొచ్చని, పదేళ్లలో లక్ష కోట్ల డాలర్లు మిగులుతాయని డెమోక్రాట్లు వాదిస్తున్నారు. అత్యంత సంపన్నులపైనా, కొన్ని పెద్ద పెద్ద కంపెనీలపై ట్యాక్స్‌లు పెంచడం ద్వారా బడ్జెట్‌ లోటును కొంతవరకు భర్తీ చేసుకోవచ్చని బైడెన్ ప్రతిపాదించారు. అయితే దీనికి స్పీకర్ మెకార్థీ ఏ మాత్రం ఆమోదం తెలపలేదు.


అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పెట్టే ఒత్తిడికి తలొగ్గి ప్రపంచంలో అనేక దేశాలు తమ తమ బడ్జెట్ల ద్రవ్యలోటు తమ జిడిపిలో ఒకానొక శాతానికి మించకుండా ఉండాలని చట్టాలు చేశాయి. అమెరికాలో 1960 నుంచీ ఇప్పటిదాకా ఈ ప్రభుత్వ రుణ గరిష్ట పరిమితిని 78 సార్లు సవరించారు. ప్రస్తుతం ఈ పరిమితి 31 కోట్ల 4 లక్షల డాలర్లుగా ఉంది. ఈ పరిమితి మేరకు ఇప్పటికే ప్రభుత్వ రుణం చేరుకుంది. బైడెన్‌ ప్రభుత్వం ఆ రుణ పరిమితిని పెంచమని అమెరికన్‌ కాంగ్రెస్‌ను అనుమతి కోరింది. ఇష్యూ పరిష్కారం కాకపోతే బైడెన్‌ ప్రభుత్వం ఇంతవరకూ తీసుకున్న రుణాల మీద వడ్డీ వాయిదాలు చెల్లించలేక ఎగవేతదారుగా నిలవవలసి వస్తుంది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×