BigTV English

Donald Trump offer: ట్రంప్ ప్రకటన.. కేబినెట్‌లో మస్క్ ఛాన్స్..

Donald Trump offer: ట్రంప్ ప్రకటన.. కేబినెట్‌లో మస్క్ ఛాన్స్..

Donald Trump offer: ఆలు లేదు.. చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెత అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అతికినట్టు సరిపోతుంది. అధ్యక్ష ఎన్నికలు పూర్తి కాకముందే టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ను తన కేబినెట్‌లోకి తీసుకుంటానని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు ట్రంప్.


రాజకీయాలంటే ఎత్తుకు పైఎత్తులు ఉంటాయి. ఓడిపోతామన్నవాళ్లు.. చివరి నిమిషంలో గెలిచిన సందర్భాలుంటాయి. ఆ విధంగా నేతలు ఓటర్లను తమవైపు తిప్పుకుంటారు. ప్రస్తుతం మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్‌ట్రంప్ కూడా అదే చేస్తున్నారు.

తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే మంత్రివర్గంలోకి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ను తీసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ వీలు కుదరని పక్షంలో సలహాదారుడిగా నియమించుకుంటానని మనసులోని మాట బయటపెట్టారు.


ALSO READ: సముద్రంలో మునిగిన షిప్.. బ్రిటన్ వ్యాపారవేత్త మైక్ లించ్ గల్లంతు..

మస్క్ చాలా తెలివైన వాడని కితాబు ఇచ్చిన ట్రంప్, ఈవీ వెహికల్స్‌పై ఇస్తున్న క్రెడిట్ ట్యాక్స్‌ను (దాదాపు 7,500 డాలర్లు) రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తానంటూ తాయిలాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. దీన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకునే పనిలోపడ్డారాయన. పన్ను ప్రోత్సాహకాలనేవి ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరేదిగా అభిప్రాయపడ్డారు.

మస్క్‌కు కీలక పదవి ఇస్తానని చెప్పడం ట్రంప్‌కు ఇదేమీ కొత్తకాదు. 2016లో రెండు కీలక సలహా మండళ్లకు ఆయనను ఎంపిక చేశారు. కాకపోతే పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి బయటకు రావాలన్న ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టారు మస్క్. 2017లో తన పదవులకు రాజీనామా చేశారాయన.

ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ సానుకూలంగా స్పందించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీకి తాను నేతృత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రభుత్వ పెట్టుబడులను క్రమబద్దీకరించి, అందులో వృథాను అరికట్టేలా ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఇటీవల తాను ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.

ట్రంప్-మస్క్ గురించి చెప్పనక్కర్లేదు. రిపబ్లిక్ అభ్యర్థిగా ట్రంప్ ఓకే అయిన తర్వాత ఓపెన్‌గా మద్దతు ప్రకటించారు మస్క్. విరాళాలు సైతం సేకరించారు. దీనికితోడు మస్క్ బిజినెస్‌మేన్ కావడంతో ఇద్దరికీ కలిసొచ్చిందని అంటున్నారు సగటు అమెరికన్లు.

ట్రంప్ వ్యవహారశైలిని డెమోక్రటిక్ నేతలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు. మాటలతో ప్రత్యర్థులపై పైచేయి సాధించాలని ట్రంప్ ఆలోచనగా చెబుతున్నారు. దీన్ని తనకు అనుకూలంగా మలచుకోవడంతో ఆయన సిద్ధహస్తురని అంటున్నారు. దీనికి సరైన రీతిలో కౌంటర్ ఇచ్చేందుకు కమలాహారిస్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

 

 

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×