E-Paper
Advertisement

బంగ్లాదేశ్‌లో మళ్లీ భగ్గుమన్న హింసలు.. 30 ఇళ్లకు పైగా అగ్గిపాలు

బంగ్లాదేశ్‌లో మళ్లీ భగ్గుమన్న హింసలు.. 30 ఇళ్లకు పైగా అగ్గిపాలు
Advertisement

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హింస తీవ్రరూపం దాల్చింది. నరైల్‌ జిల్లాలో అవామీ లీగ్‌ నాయకులు, కార్యకర్తలకు చెందిన ఆస్తులపై దాడులు జరిగాయి. 30 ఇళ్లకు పైగా నిప్పు పెట్టారు. ఇళ్లు, షాపులు ధ్వంసం చేయడంతో పాటు దోపిడీలు కొనసాగాయి. బంగ్లాదేశ్ వ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ ఘటనలు సంచలనంగా మారుతన్నాయి.

హింసాత్మక ఘటనలు..

నవంబర్ 18న అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చేపట్టిన మోటార్‌సైకిళ్ల ర్యాలీపై జరిగిన దాడిలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు హత్యకు గురయ్యారు. దీంతో మృతుల కుటుంబసభ్యులు, పార్టీ మద్ధతుదారులు అవామీలీగ్ నాయకులు, కార్యకర్తల ఇళ్లను టార్గెట్ చేశారు. నవంబర్ 20, శుక్రవారం కాలియా సబ్ డిస్ట్రిక్ట్ లోని బెందర్‌చార్‌ గ్రామంలో హింసాత్మక ఘటనలు జరిగాయి. అవామీలీగ్‌కు చెందిన పలువురు కీలక నేతల ఇళ్లపై దాడులు చేశారు ఆందోళనకారులు. 50 ఇళ్లు, షాపులు ధ్వసం చేశారు. ఈ దాడుల వెనుక అధికార BNP మద్దతుదారులు ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. జిల్లా అధికారులు మాత్రం దాడులు ఎవరు చేశారనేది తెలియడం లేదంటున్నారు.

మద్ధతుదారుల మధ్య ఘర్షణలు..

Advertisement

అలర్లు మరో జిల్లాకు విస్తరించాయి. పబ్నా జిల్లాలోని బేరా మున్సిపాలిటీలో BNP, అవామీలీగ్ మద్ధతుదారుల మధ్య ఘర్షణలు జరిగాయి. వీధుల్లో కొన్ని గంటలపాటు దాడులు, ప్రతిదాడులు కొనసాగాయి. పోలీసులు రబ్బరు బులెట్లు ప్రయోగించి ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. ప్రస్తుతం పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాడులు జరిగే అవకాశం ఉన్న జిల్లాల్లో 95 ప్లటూన్ల బలగాల్ని మోహరించారు. ఢాకా, నారాయణ్‌గంజ్, గాజీపూర్, గోపాల్‌గంజ్, మైమెన్‌సింగ్, ఫరీద్‌పూర్, కాక్స్ బజార్ ప్రాంతాల్లో ప్రధానంగా బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ బలగాలు పహారా కాస్తున్నాయి. మొత్తంగా అల్లర్లు దేశమంతా పాకే పరిస్థితి కనిపిస్తోంది. 2024 నాటి వాతవరణం మళ్లీ రిపీట్ అవుతుందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి.

Also read: టీపీసీసీ భేటీలో మహేష్ కుమార్ గౌడ్ దత్తత పంచులు!

Tags

Related News

డోనాల్డ్ ట్రంప్‌‌కు ఘోర అవమానం.. పట్టించుకోని నార్త్ కొరియా..?

తరాలు మారినా వీరి ఇల్లు మాత్రం మారదు.. చైనాలో ఓ అద్బుత రాజ్యం?

టెక్ కంపెనీలకు ట్రంప్ వార్నింగ్.. విదేశాల్లో డేటా సెంటర్లు నిర్మిస్తే భారీగా పన్నులు, విశాఖ డేటా సెంటర్ మాటేంటి?

సౌదీలో రూటు మార్చిన హూతీలు.. రియాద్‌లో భారీ భవనాలు టార్గెట్, పీఐఎఫ్ టవర్‌పై క్షిపణుల దాడి

రోహింగ్యాలపై మారణహోమం నిజమే.. మయన్మార్‌ను దోషిగా తేల్చిన అంతర్జాతీయ కోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ!

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస.. మాజీ చీఫ్ యూనస్ ఇంటికి దుండగుల నిప్పు, భారీగా బలగాలు మోహరింపు

అమెరికా డ్రీమ్‌కు బ్రేక్.. గ్రీన్‌కార్డు రూల్స్ మరింత కఠినం! భారతీయుల ఆశలపై ట్రంప్ సర్కార్ నీళ్లు!

Big Stories

Advertisement
×