BigTV English

Elon Musk: పుతిన్ వెనక్కి తగ్గితే హత్య చేస్తారు.. ఎల్లన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Elon Musk: పుతిన్ వెనక్కి తగ్గితే హత్య చేస్తారు.. ఎల్లన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Interesting comments from Elon Musk: టెస్లా కంపెనీ ఓన‌ర్ ఎల్ల‌న్ మ‌స్క్(Elon Musk) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రష్యా, ఉక్రెయిన్ యుద్దంలో ఒక వేళ ఉక్రయిన్ యుద్దం నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెన‌క్కి త‌గ్గితే, అప్పుడు అత‌న్ని హ‌త్య చేసినా ఆశ్చ‌ర్యంలేద‌న్నారు. సోమ‌వారం ఓ స‌భ‌లో ఎల్లన్ మాస్క్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.


ఉక్రెయిన్‌తో జ‌రుగుతున్న యుద్ధంలో పుతిన్ ఓడిపోడు అని ఎల్లన్ మాస్క్ స్ప‌ష్టం చేశారు. యుద్ధంతో స‌త‌మ‌తం అవుతున్న ఉక్రెయిన్‌కు మ‌రింత స‌హాయాన్ని అందించడానికి అమెరికా సేనేట్‌లో బిల్లు పెట్టిన నేప‌థ్యంలో మ‌స్క్ ఆ వ్యాఖ్య‌లు చేశారు.

ఉక్రెయిన్ వార్‌లో పుతిన్ ఓడిపోర‌న్న అభిప్రాయాల‌ను మ‌స్క్ స‌మ‌ర్తించారు. ఉక్రెయిన్ గెలుస్తుందనే క‌ల్పిత ప్ర‌పంచంలో ఉండ‌వ‌ద్ద‌ని పేర్కొన్నారు. బిల్లుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం అంటే.. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని పొడిగించ‌డ‌మే అవుతుంద‌న్నారు ఎల్లన్ మాస్క్. యుద్ధాన్ని కొన‌సాగించాల‌న్న వ‌త్తిడి పుతిన్‌పై ఉంద‌న్నారు. ఒక‌వేళ ఆయ‌న వెన‌క్కి త‌గ్గితే, అప్పుడు ఆయ‌న్ను హ‌త‌మారుస్తార‌ని మ‌స్క్ పేర్కొన్నారు. 95 బిలియ‌న్ల డాల‌ర్ల సాయాన్ని అందించేందుకు అమెరికా సేనేట్‌లో బిల్లు పెండింగ్‌లో ఉందన్నారు.


ఉక్రెయిన్, రష్యా దేశాల మరణాలు రెండు వైపులా ఆగాల‌ని ఆశిస్తున్న‌ట్లు మస్క్ తెలిపారు. ఒక‌వేళ ర‌ష్యాలో ప్ర‌భుత్వం మారాల‌ని భావిస్తే, అప్పుడు దానికి త‌గిన వ్య‌క్తిని ఎన్నుకోవాల‌న్నారు. కానీ ఆ వ్య‌క్తి పుతిన్ క‌న్నా క‌ఠిన వ్య‌క్తే అయి ఉంటాడ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×