E-Paper
Advertisement

Flight Crashed : కెనడాలో కూలిన విమానం.. ఆరుగురు మృతి

Flight Crashed : కెనడాలో కూలిన విమానం.. ఆరుగురు మృతి
Advertisement

Flight Crashed : కెనడాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. కార్మికులతో వెళ్తోన్న విమానం కూలిపోవడంతో ఆరుగురు మృతి చెందారు. నార్త్ వెస్ట్ టెరిటరీస్ లో ఈ ఘోరప్రమాదం జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. రియో టింటో మైనింగ్ సంస్థకు చెందిన దియావిక్ వజ్రాల గని వద్దకు కొందరు కార్మికులను తీసుకుని పోర్ట్ స్మిత్ నుంచి ఒక మినీ విమానం బయల్దేరింది.

అయితే.. ఆ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి. రన్ వే చివరి నుంచి కిలోమీటర్ పరిధిలో విమానం కుప్పకూలినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. ఒకరు ప్రాణాలతో బయటపడినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. కానీ.. ప్రాణాలతో బయటపడిన ఆ ఒక వ్యక్తి ఎవరన్నది మాత్రం తెలియరాలేదు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

మరోవైపు.. వార్త్ వెస్టర్న్ ఎయిర్ విమానయాన సంస్థ ఈ దుర్ఘటనపై స్పందించింది. కుప్పకూలిన విమానం ఛార్టర్ ఫ్లైట్ అని తెలిపింది. ఈ ప్రమాదం కారణంగా.. పోర్ట్ స్మిత్ నుంచి తాత్కాలికంగా విమాన సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు కెనడా రవాణా భద్రతాబోర్డు ప్రత్యేక బృందాన్ని నియమించింది.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×