E-Paper
Advertisement

Floating Bridge : తేలియాడే బ్రిడ్జిలు.. ఎంతో ఫన్

Floating Bridge : తేలియాడే బ్రిడ్జిలు.. ఎంతో ఫన్
Advertisement
floating bridge

Floating Bridge : నీళ్ల మధ్యలో తేలియాడే రోడ్డుపై ప్రయాణిస్తుంటే ఎలా ఉంటుంది? కొంత భయం వేయడం నిజమే అయినా.. ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది కదూ? అలాంటి ఫ్లోటింగ్ రోడ్లు, బ్రిడ్జిలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. రెండు భూభాగాలను కలుపుతూ నీటిపై నిర్మించిన తేలియాడే బ్రిడ్జిలను పాంటూన్ బ్రిడ్జిలు అంటారు. లైఫ్‌టైమ్‌లో ఒకసారైనా అలాంటివాటిపై ప్రయాణించాలనుకునే కొన్ని ప్రధాన బ్రిడ్జిలివి.

షైజిగ్వాన్ ఫ్లోటింగ్ బ్రిడ్జి (చైనా)

Advertisement

లాంగ్ బ్రిడ్జి ఆఫ్ డ్రీమ్స్ అని కూడా పిలుస్తారు. హ్యుబె ప్రావిన్స్‌లోని షియాన్‌యెన్ కౌంటీలో ఉందీ తేలియాడే బ్రిడ్జి. ప్రపంచంలోని ప్రసిద్ధ పాంటూన్ బ్రిడ్జిల్లో ఇదొకటి. పచ్చటి ప్రకృతి ఒడిలో నదిపై నిర్మించిన షైజిగ్వాన్ బ్రిడ్జిపై వెళ్తుంటే ఊయల ఊగినట్టుగా ఓ మధురమైన అనుభూతి మిగులుతుంది.

నార్డ్‌హోర్డ్‌లాండ్ బ్రిడ్జి(నార్వే)

Advertisement

వెస్ట్‌లాండ్ కౌంటీలోని బెర్గెన్, అల్వేర్ మునిసిపాలిటీల మధ్య ఉన్న సాలస్‌ఫ్యోడెన్ పాయపై దీనిని నిర్మించారు. పొడవు 5,295 అడుగులు. కేబుల్, పాంటూన్ సాంకేతికతను కలగలిపి ఈ బ్రిడ్జిని నిర్మించారు.

హోమర్ ఎం హాడ్లీ మోమోరియల్ బ్రిడ్జి(అమెరికా)

థర్డ్ లేక్ వాషింగ్టన్ బ్రిడ్జి అని కూడా పేరుంది. వాషింగ్టన్‌లోని సియాటెల్ మెట్రోపాలిటన్ ఏరియాలో ఉందీ ఫ్లోటింగ్ బ్రిడ్జి. ప్రపంచంలో అయిదో అతి పొడవైన బ్రిడ్జి ఇది. పొడవు 5,811 అడుగులు. మరమ్మతుల సమయంలో పూర్వపు బ్రిడ్జిలో కొంత భాగం 1990లో మునిగిపోయింది. ప్రస్తుత బ్రిడ్జి 1993లో నిర్మించారు.

విలియం ఆర్ బెన్నెట్ బ్రిడ్జి(కెనడా)

బ్రిటిష్ కొలంబియాలో ఒకానగన్ లేక్‌పై నిర్మితమైన ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జి పొడవు 1060 మీటర్లు. అలల తాకిడికి, గాలుల ఉధృతికీ నీటిపై కదలాడుతుంటుంది.

బేపూర్ మెరీనా బీచ్ ఫ్లోటింగ్ బ్రిడ్జి(కేరళ)

కోళికోడ్‌లోని ఈ బ్రిడ్జి రాష్ట్రంలోనే మొట్టమొదటిది. 2022లో ఆరంభమైంది. పొడవు 100 మీటర్లు, వెడల్పు 3 మీటర్లు. అలలపై తేలియాడుతున్న అనుభూతిని టూరిస్టులు ఈ బ్రిడ్జి ద్వారా పొందగలుగుతారు.

Related News

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

Big Stories

Advertisement
×