Imran Khan: పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధినేత, మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కాసేపటి క్రితం ఆదియాలా జైలులో మరణించారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో నిఘా సంస్థ ఐఎస్ఐ హత్య చేసిందనే వార్త తెగ వైరల్ గా మారింది.
అయితే, పాకిస్థాన్ మీడియా దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేశారని ఫేక్ వార్త ప్రచారం అవుతోందని.. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని పాక్ మీడియా తెలిపింది. కావాలనే కొందరు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ఇమ్రాన్ ఖాన్ జైలు లోపల సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని పాకిస్తాన్ మీడియా పేర్కొంది.
Also Read: India Vs Pakistan War : యుద్ధంతో పాక్‌కు భారత్ నేర్పిన గుణపాఠం ఇదే..
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను నిఘా సంస్థ ఐఎస్ఐ జైలు లోపల చంపిందని సోషల్ మీడియాలో వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి. జైలు లోపల ఇమ్రాన్ ఖాన్‌కు విషం ఇచ్చి హత్య చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, పాకిస్తాన్ మీడియా ఈ వార్తలను తీవ్రంగా ఖండించింది. ఈ ఫేక్ వార్తలకు సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వం లేదా జైలు అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదని వివరించింది.
Also Read: PM Modi: ఉగ్రవాదంపై మోదీ సంచలన నిర్ణయం.. ఇక మరోసారి అలాచేస్తే దేత్తడే..!